శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (18:51 IST)

శ్రుతి పుట్టిన రోజు వేడుకలు.. అభిమానులకు స్పెషల్ గిఫ్ట్...!

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అంటూ బహుభాషా నటిగా వెలుగుతున్న బ్యూటీ శ్రుతి హాసన్. ఈ నెల 28వ తేదిన శ్రుతి హాసన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకోనుంది. ఈ ఏడాది తన జన్మదిన వేడుకల సందర్భంగా అభిమానులకు తాను స్పెషల్ గిఫ్ట్‌ ఇవ్వనున్నట్లు తెలుపుతోంది.
 
అదేమిటంటే శ్రుతి బర్త్‌డే సందర్భంగా ఆన్‌లైన్‌లో తన అభిమానులతో కలిసి లైవ్ ఇంటరాక్షన్ చేస్తుందట. ఆమెతో మాట్లాడాలనుకునే అభిమానులు వారి ఫోటోలను, వివరాలను తనకు పోస్ట్ చేయమని శ్రుతి కోరుతోంది. అలా వచ్చిన వివరాలలో ఐదుగురు అభిమానులను ఎంపిక చేసి, తన పుట్టిన రోజు సందర్బంగా వారికి శ్రుతి ఫోన్ చేసి మాట్లాడుతుందట. అంతేకాదండోయ్ ఒక స్పెషల్ మెసేజ్‌తో పాటు, ఆటో గ్రాఫ్‌ను కూడా ఇస్తానని శ్రుతి వెల్లడించింది.