గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 23 జనవరి 2015 (14:05 IST)

స్టార్ మహిళ 2000 ఎపిసోడ్స్... యాంకర్ సుమ రికార్డ్

‘స్టార్ మహిళ’ ! తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు సుపరిచితమైన కార్యక్రమం. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు ఈటీవి లో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమం నేటితో 2000 ఎపిసోడ్‌ల మైలురాయిని అందుకుంది. టెలివిజన్ చరిత్రలో 2000 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్న ఏకైక మహిళా గేమ్ షో ‘స్టార్ మహిళ’ కావడం ఒక రికార్డ్. 

 
ఐదు ఇంట్రెస్టింగ్ రౌండ్స్‌తో, ఆరుగురు కలర్‌పుల్ పార్టిసిపెంట్స్‌తో యాంకర్ సుమ నిర్వహిస్తున్న ఈ షో గత ఆరు సంవత్సరాలుగా నిరంతరాయంగా ప్రసారమవుతూ ప్రేక్షకులకు స్వచ్చమైన వినోదాన్ని అందిస్తుంది. పేరుకు మహిళా గేమ్ షో అయినప్పటికి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ నెం.1 మహిళా గేమ్ షోగా ముందుకు దూసుకుపోతుంది.