గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 13 సెప్టెంబరు 2014 (11:56 IST)

పెళ్లి గురించి సల్మాన్‌ను నన్ను అడగక మానేస్తే మంచిది: టబు

అవునండి.. పెళ్లి ఊసెత్తితేనే తబు ఇబ్బంది పడితోపోతోంది. తన పెళ్లి గురించి అడిగితే లాభం లేదంటోంది. బాలీవుడ్ నటి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచయురాలైన ఈ అమ్మడు  ఇన్నాళ్లూ పెళ్లి గురించి ఎప్పుడడిగినా నలభై మూడేళ్ల నవ్వుతూ సమాధానం ఇచ్చేది. 'కంగారేముంది... దేనికైనా టైం రావాలి కదా?' అంటూ తప్పించుకునేది.
 
అయితే, ఇప్పుడిక ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది. "అసలింతవరకు నా పెళ్లి గురించి ఎన్నిసార్లు అడిగారో లెక్కేలేదు. అయినా మీకో విషయం చెప్పనా... సల్మాన్ ఖాన్‌నీ, నన్నూ ఈ విషయం గురించి అడగడం మానేస్తే మంచిదేమో" అంటూ ట్విస్ట్ ఇచ్చింది. 
 
అంటే, తానిక పెళ్లి చేసుకోనని సల్మాన్ ఈమధ్యే తేల్చి చెప్పేశాడు. తనది కూడా అదే సమాధానం అని అమ్మడు ఇండైరేక్ట్‌గా చెబుతోందా? అనే డౌట్ రాక తప్పదు మరీ.