శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2015 (13:13 IST)

''బాహుబలి'' రానా వార్ ఫీల్డ్ సీక్వెన్స్ అదుర్స్.. సమంత రెస్పాన్స్ wowww!

''బాహుబలి'' సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ''బాహుబలి''కి సంబంధించిన కొత్త పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. రానా బాహుబలిలో తన పోస్టర్‌ను సామాజిక వెబ్ సైట్లో పోస్ట్ చేశాడు. ఈ పోస్టర్లో వార్ ఫీల్డ్ సీక్వెన్స్‌లో అదిరిపోయాడని, యుద్ధవీరుడిగా రానా సింహంలా వీరవిహారం చేస్తున్నాడనే టాక్ వస్తోంది. ఈ పోస్టర్‌పై సమంత స్పందించింది. 
 
రానా పోస్టర్‌పై "@RanaDaggubati wowww" అంటూ ట్వీట్ చేసింది. రాజమౌళి దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రోజు రోజుకి పబ్లిసిటీ పెరిగిపోతోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను రాజమౌళి ప్రకటించబోతున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో సామాజిక వెబ్ సైట్లలో బాహుబలి నటులు పోస్ట్ చేస్తున్న పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది.