శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 26 జనవరి 2015 (17:42 IST)

మహేష్ బాబు తల్లిగా సుకన్య: జగపతిబాబుకు భార్యగా..!

మహేష్ బాబు తల్లిగా సుకన్య ఎంపికైంది. రెండు దశాబ్దాల క్రితం వచ్చిన 'పెద్దరికం' చిత్రంలో జగపతి, సుకన్య హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఆమె మహేష్‌కి తల్లిగా, జగపతిబాబుకు భార్యగా నటిస్తుంది. 
 
ఈ సినిమాలో మహేష్ తల్లి పాత్ర చాలా కీలకమైనది. గ్లామరస్‌గా వున్న, ఇమేజ్ వున్న నటి కావాల్సి వచ్చింది. దాంతో మొదట్లో నదియాను, ఆ తర్వాత బాలీవుడ్ నటి గ్రేసీ సింగ్‌ను అనుకున్నారు. అయితే, వారు పెద్ద మొత్తంలో డిమాండు చేయడంతో తాజాగా సుకన్యను ఎంచుకున్నట్టు సమాచారం.