శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (11:53 IST)

హ్యాపీ బర్త్ డే... హీరోగా సునీల్ బిజీ బిజీ..!

టాలీవుడ్‌లో హాస్యనటుడుగా గుర్తింపు పొంది, హీరో అవతారం ఎత్తిన కామెడీ హీరో సునీల్. ఈయన భీమ‌వ‌రం బుల్లోడు త‌ర‌వాత హీరోగా ఖాళీ అయ్యాడు. ప‌రాజ‌యాల నుంచి పాఠాలు నేర్చుకొని, మ‌ళ్లీ తెర‌పైకి రావ‌డానికి కాస్త స‌మ‌యం తీసుకొన్నాడు.

తాజాగా సునీల్ దిల్‌రాజు బ్యాన‌ర్‌లో ఓ చిత్రంలో న‌టిస్తున్నాడు‌. ఈ స్థితిలో మ‌రో సినిమా స్టార్ట్ అయ్యింది. సునీల్‌ హీరోగా ఆర్‌.పి.ఏ క్రియేష‌న్స్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోంది. 
 
ఈ చిత్రానికి మోక్ష చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారిన వంశీ కృష్ణ ఆకెళ్ల ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. సునీల్ నుంచి ప్రేక్ష‌కులు కోరుకొనే అన్ని అంశాలూ ఈ సినిమాలో ఉంటాయ‌ని చిత్ర దర్శకుడు వంశీ కృష్ణ అంటున్నారు. ఇది వంద శాతం ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర‌ని చిత్ర యూనిట్ తెలుపుతోంది. 
 
ఫిబ్రవరి 28వ తేది సునీల్ పుట్టిన రోజు కావడంతో ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ, సునీల్ ఇలానే చేతి నిండా సినిమాల‌తో ఈ యేడాదంతా బిజీ బిజీగా ఉండాల‌ని, మ‌రిన్ని మంచి సినిమాలు అందించాల‌ని కోరుకుంటున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.