శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2015 (14:57 IST)

తమిళంలో రిలీజ్ కానున్న మహేష్ బాబు 1- నేనొక్కడినే!

టాలీవుడ్‌ ప్రిన్స్ మహేష్ బాబు 1-నేనొక్కడినే సినిమా తెలుగు ప్రేక్షకులను మోస్తరుగా ఆకట్టుకుంది. బ్లాక్‌బస్టర్ హిట్ కాకపోయినా.. మిశ్రమ ఫలితాలొచ్చాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో డబ్బింగ్ అయ్యింది. అలాగే తమిళంలోనూ మహేష్ బాబుకు మంచి క్రేజ్ ఉండటంతో కోలీవుడ్ తెరపై మహేష్ బాబు 1- నేనొక్కడినే సినిమాను రిలీజ్ చేసేందుకు సర్వం సిద్ధమైంది. 
 
ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 1 మూవీ.. ఏప్రిల్ 24న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. మరి తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేని నేనొక్కడినే మూవీ తమిళ ప్రేక్షకులకు ఎలా చేరువవుతుందో వేచి చూడాలి.