శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (17:37 IST)

సుమంత్‌తో సుష్మా రాజ్: ఛాన్సులే ఛాన్సులు!

మాయ, జోరు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన సుష్మా రాజ్‌కు టాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లువల్లా వస్తున్నాయి. కొత్త భామలకు ఎప్పుడూ స్వాగతం పలకడంలో ముందుండే టాలీవుడ్‌.. సుష్మాకు ఆఫర్లు ఇచ్చేందుకు రెడీ అంటోంది. 
 
తాజాగా ప్రముఖ నటుడు శివనాగేశ్వరరావు దర్శకత్వంలో నటించే ఛాన్స్ సుష్మను వరించింది. అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్‌తో శివనాగేశ్వరరావు తీస్తున్న చిత్రంలో సుష్మాను హీరోయిన్‌గా బుక్ చేశారట. సినిమాల్లోకి రాకమునుపు ఈ ముద్దుగుమ్మ బెంగళూర్‌లో మోడల్‌గా పనిచేసింది.