గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 15 నవంబరు 2014 (17:55 IST)

సమంత చీపురు పట్టి రోడ్లు ఊడ్చింది... అయ్యో పనివాళ్లంటూ...

టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు చీపురు పట్టి రెండు మూడు వీధుల్లోని చెత్తనంతా ఉడ్చేసింది. యంగ్ హీరో రామ్ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఆమెను నామినేట్ చేయడంతో సమంత ప్రతిస్పందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంది. సమంత ఓ ప్రభుత్వ పాఠశాల ఆవరణతోపాటు పక్క వీధుల్లోనూ చీపురు పట్టుకుని ఊడ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
 
సమంత తను చీపురితో ఊడ్చిన ఫోటోలను ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేస్తూ... స్వచ్ఛ భారత్‌లో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొని చీపురుతో చెత్తను శుభ్రం చేయడం ఆనందంగా ఉందంటూ ట్వీటింది. అంతేకాదు ఆమె రోడ్లు శుభ్రం చేసి కార్మికులతో ఫోటోలు దిగింది. ఇంకా వారు ఇలా శుభ్రం చేస్తున్నందుకు నెలకు రూ.5 వేలు మాత్రమే ఇస్తుంటారనీ, కానీ మీ వీధుల్లోని చెత్తను మీరే శుభ్రపర్చుకుంటూ వారికి ఎక్కువ పని ఉండదంటూ ట్వీట్ చేసింది.