బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 24 జూన్ 2015 (12:11 IST)

స్వాతి ''త్రిపుర'' షూటింగ్ ఓవర్ : అది మాత్రం సస్పెన్స్ అంటున్న..?

స్వాతి త్రిపుర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జూలై రెండో వారంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. స్వాతి ప్రధాన పాత్రలో క్రేజీ మీడియా పతాకంపై రాజకిరణ్ దర్శకత్వం వహిస్తోన్న త్రిపుర సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులో స్వాతి ఇంట్రడక్షన్ సాంగ్‌ను తమిళనాడులోని కుట్రాలంలో, మరొకటి పొల్లాచ్చి, కొడైకెనాల్‌లోనూ చిత్రీకరించనున్నట్లు నిర్మాత తెలిపారు. 
 
హారర్, థ్రిల్లర్ మూవీగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో త్రిపుర పాత్రకు స్వాతి వందశాతం న్యాయం చేసిందని, మరో పాత్రను పూజారామచంద్రన్ నటిస్తోందని, దర్శకుడు చెప్పిన కథను అద్భుతంగా తెరపై ఆవిష్కరించనున్నట్లు నిర్మాత వెల్లడించారు.
 
కథ డిమాండ్ మేరకు ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నామని, బలమైన కథనంతో చేస్తున్న ఈ చిత్రంలో త్రిపుర ఏం చేస్తుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, శ్రీనివాస్ వెలిగొండ, మాటలు: రాజా, కెమెరా: రవికుమార్ సానా, ఎడిటింగ్: ఉపేంద్ర, నిర్మాతలు: ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్, దర్శకత్వం: రాజకిరణ్.