గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2014 (16:57 IST)

శ్వేతాబసు ప్రసాద్ పోలీసులకు చిక్కినపుడు ఎలా ఉందంటే...!

'కొత్త బంగారు లోకం' చిత్రంలో తన అంద చందాలతో ఆకట్టుకున్న హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యభిచారం చేస్తూ హైదరాబాద్ పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. బంజారాహిల్స్‌లోని ఓ నక్షత్ర హోటల్‌పై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా నిర్వహించిన సోదాల్లో ఈ హీరోయిన్ దొరికిపోయింది. హోటల్ గదిలోకి పోలీసులు వెళ్లినపుడు శ్వేతాబసు తన కస్టమర్‌తో అన్‌కాంప్రమైజ్డ్ పొజిషన్‌లో ఉండటాన్ని చూసిన పోలీసులు విస్తుపోయారు. ఆ తర్వాత తేరుకుని ఆమెతో పాటు.. ఆమెతో ఉన్న పారిశ్రామికవేత్తను సైతం అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతని పేరును మాత్రం వెల్లడించడం లేదు. 
 
కాగా, గతంలో కూడా ఓ సారి పోలీసులకు బుక్కైన ఈ భామ.. ఇపుడు ఓ ప్రాంతీయ చానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌తో అడ్డంగా బుక్కైనట్టు ప్రచారం సాగుతోంది. ఈమెకు వ్యభిచార ఆఫర్లు అప్పగిస్తూ వచ్చిన బాలు అనే మధ్యవర్తి (బ్రోకర్)ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దర్ని పోలీసులు సోమవారం ఉదయం కోర్టులో హాజరు పరిచి, కోర్టు ఆదేశం మేరకు ప్రభుత్వ పునరావాస కేంద్రానికి పంజాగుట్ట పోలీసులు తరలించారు. అలాగే బాలును చర్లపల్లి జైలుకు తరలించారు. పోలీసులు బాలును కస్టడీలోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అతడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
అయితే, శ్వేతాబసుపై ఓ ప్రాంతీయ టీవీ చానెల్‌ గత మూడు నెలలుగా నిఘా పెట్టినట్టు వినికిడి. ఇందుకోసం స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి, శ్వేతాబసు ప్రసాద్‌ పోలీసులకు చిక్కేలా చేసినట్టు సమాచారం. తెలుగులో ‘కొత్త బంగారు లోకం' చిత్రం ద్వారా కెరీర్ ప్రారంభించిన శ్వేతాబసుకు ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో ఐటం సాంగ్‌ల్లో నర్తించడం ప్రారంభించింది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా.... తన విలాసవంతమైన జీవితానికి సరిపడ డబ్బు సంపాదించే పరిస్థితి లేక పోవడంతో ఇలా వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయింది.