శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : బుధవారం, 3 సెప్టెంబరు 2014 (09:27 IST)

వ్యభిచారం కేసులో నటి శ్వేతాబసు అరెస్టు వెనుక ఎవరున్నారు?

కోల్‌కతా ముద్దుగుమ్మ సినీ నటి శ్వేతాబసు వ్యభిచారం కేసులో అరెస్టు కావడం వెనుక ఎవరున్నారనే అంశంపై ఇపుడు చర్చ సాగుతోంది. వాస్తవానికి ఈ తరహా కేసులో ఆమె అరెస్టు కావడం ఇది తొలిసారి కాదు. గతంలో ఒకసారి చిక్కి.. పోలీసులు వార్నింగ్‌తో విడుదలయ్యారు. 
 
గతంలో కూడా ఓ టీవీ చానల్‌ నిర్వహించిన ఆపరేషన్‌లో తన గుట్టును తానే బయటపెట్టుకుంది. ఇది కాకుండా మరోసారి దొరికిపోయినప్పటికీ అప్పుడు పోలీసులు వార్నింగ్‌ ఇచ్చి వదిలేశారని అంటూ మంగళవారం మీడియాలో కథనాలు వచ్చాయి. శ్వేతాబసును అరెస్టు చేయడానికి డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించామని పోలీసులు అంటున్నారు. 
 
శ్వేతాబసు వ్యవహారంలో ఒక పారిశ్రామికవేత్త ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ వాదనను పోలీసులు కొట్టిపారేస్తున్నారు. అయితే శ్వేతాబసు మాత్రం ఒక మొబైల్స్‌ కంపెనీ ప్రతినిధి చేతుల్లో బొమ్మ అని తెలుస్తోందంటూ మీడియా కథనాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆదివారం రాత్రి జరిగిన ఆపరేషన్‌లో అతడూ ఉన్నాడని సమాచారం. 
 
పోలీసులు నిర్వహించిన డెకాయ్‌ ఆపరేషన్‌ శ్వేతపైన చేశారా, లేకుంటే బ్రోకర్‌గా చెబుతున్న బాలుపైన చేశార అనే విషయంపై లేదని మీడియా వార్తాకథనాలు అంటున్నాయి. సినీ పరిశ్రమలో ఒక వర్గం శ్వేతాబసును టార్గెట్‌ చేసినట్టు ప్రచారం సాగుతోంది. పరిశ్రమలో బ్రోకర్లకు కొదువలేదు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చెబుతున్న బాలు ఎవరిన్నదీ పూర్తి వివరాలు చెప్పడం లేదు.