గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (10:04 IST)

దివి నుంచి భువికి...! తమన్న ఫస్ట్‌లుక్ అదరహో...!

దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్య అంటేనే టక్కున గుర్తొచ్చేది శ్రీదేవినే... ఆమె మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో అప్పట్లో అదరహో అనిపించుకున్నారు. ఆమె తరువాత అనేక చిత్రాల్లో దేవకన్య కేరక్టర్లు వచ్చినా అంతగా ఆకట్టుకోలేదు. 
 
అయితే ప్రస్తుతం మళ్లీ అలాంటి కేరక్టరే బాహుబలి చిత్రంలో తమన్న చేస్తోంది. ఈ మిల్క్ బ్యూటీ దేవకన్యలా నిలువెల్లా సౌందర్యంతో మెరిసిపోతున్న ఫస్ట్ లుక్ అదరహో అంటోంది. 
 
తమన్న బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ లుక్ యువకుల మతులు పోగొడుతోంది. ఈ మిల్కీ బ్యూటీని చాలా మంది దర్శకులు చాలా అందంగా చూపించారు కానీ, ఇంత సౌందర్యరాశిగా మరెవరూ చూపించలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
 
ఈ 'బాహుబలి'లో ద్విపాత్రాభినయం చేస్తున్న ప్రభాస్ (కొడుకు పాత్ర) సరసన అవంతిక పాత్రలో తమన్నా నటిస్తోంది. కాగా శ్రీదేవి తెచ్చుకున్నంత పేరు తనకూ వస్తుందని తమన్న ధీమా వ్యక్తం చేస్తోంది.