శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 1 సెప్టెంబరు 2014 (19:57 IST)

కుక్కను పట్టుకొచ్చా... ఎవరిదో తీసుకెళ్లండి... ట్విట్టర్లో తమన్నా

తమన్నాకు రోడ్డుకు అడ్డంగా పరుగెడుతున్న ఓ కుక్క కనిపించిందట. అంతే... తను ప్రయాణిస్తున్న కారును ఆపేసి ఆ కుక్క వెంట పరుగెట్టుకుంటూ వెళ్లి పట్టేసిందట. బాగా జూలు వేలాడుతున్న కోకర్ స్పానియల్ జాతి కుక్కను పట్టుకొచ్చిన తమన్నా... దాని యజమాని ఎవరో వచ్చి కుక్కను తీసుకెళ్లమని ట్విట్టర్లో కుక్క ఫోటోను పోస్ట్ చేసింది.
 
సినిమా స్టార్లు తమ షూటింగులతో యమ బిజీగా ఉంటారు. కానీ మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం రోడ్డుకిరువైపులా ఏం జరుగుతుందో చూస్తూ వెళుతుందన్నమాట. అంతేకాదు... ఇలాగ ఏవైనా పెంపుడు కుక్కలు తన కంటపడితే పట్టేసి ట్విట్టర్లో కూడా పెడుతోంది. తమన్నా పట్టుకొచ్చిన కుక్క ముంబై శివారు ప్రాంతం సౌత్ ఖార్ ఏరియాలో తిరుగుతూ ఉందట. కుక్కను గుర్తించినవారు తమకు ఫోన్ చేయాలంటూ ఫోన్ నెంబరు కూడా ఇచ్చింది.