శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 9 ఆగస్టు 2014 (16:54 IST)

నా తప్పేముంది.. హిట్, ఫ్లాప్ మన చేతుల్లోలేవు: తమన్నా

సినిమాలు హిట్‌కు హీరోలపైనే క్రెడిట్‌ వేస్తుంటారు. ఒక్కోసారి హీరోయిన్లకు క్రెడిట్‌ వస్తుంది. అసలు రావాల్సింది దర్శకుడి. ఆర్టిస్టుచేత ఇలా చేయించాలని చెప్పించేది తనే గనుక... ఇటీవలే 'అల్లుడుశీను'లో ఐటంసాంగ్‌లో నటించింది. 
 
ఇలా చేయడం దర్శకుడి ఆలోచనకు నిదర్శనం. భారీ సంస్థ, దర్శకుడు దృష్టిలో పెట్టుకుని చేశానని అంది. తెలుగులో మంచి కెరీర్‌ వున్న బాలీవుడ్‌లో కూడా చేస్తున్నాననీ, అందుకే గ్యాప్‌ దొరకడంలేదని అంటున్న తమన్నా... 'ఎంటర్‌టైన్‌మెంట్‌' సినిమాలో నటించింది. 
 
నిన్ననే సినిమా విడుదలైంది. అయితే మొదట సినిమాకు వచ్చినంత బ్యాడ్‌టాక్‌ దీనికీ వచ్చింది. 'హమ్‌షకల్స్‌'లోకూడా ఆమెకు మంచి హిట్‌ దొరకలేదు. దాంతో బాలీవుడ్‌ మీడియా ఆమెను ఐరన్‌లెగ్‌గా ముద్రవేసేస్తూ వ్యాసాలు రాసేస్తున్నారు.
 
అంతకుముందు హిమ్మత్‌వాలాకూడా పోలీస్తు రివ్యూలు రాస్తుంటే.. తనేం తక్కువ తినలేదు. పాత్రపరంగా దర్శకుడి చెప్పినట్లు చేశాను. హిట్‌, ప్లాప్‌ అనేవి దైవ నిర్ణయాలు. మన చేతుల్లోలేవని... అంటూ ట్విట్లర్‌లో పోస్టు చేసింది.