శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2015 (14:51 IST)

'ఉత్తమ విలన్‌'కు వీహెచ్‌పీ అడ్డంకులు.. కమల్‌కు నిర్మాతల సపోర్ట్..!

విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం 'ఉత్తమ విలన్'. ఈ చిత్రం విడుదలకు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నుంచి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇందులో హిందువుల మనోభావాలను దెబ్బతీసే రీతిలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించే వరకు సినిమా విడుదల చేయరాదంటూ వీహెచ్‌పీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. 
 
ఎన్నో రోజుల క్రితం షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకున్న 'ఉత్తమ విలన్' అనేక కారణాల వలన చాలా ఆలస్యమయింది. ఏప్రిల్ 17వ తేది విడుదల చేయాలని అనుకుంటుండగా అకస్మాత్తుగా విడుదల తేదిని మే 1కి మార్చారు. 
 
కార్మికుల దినం రోజున విడుదల అవుతుందని అనుకుంటుండగా తాజాగా విహెచ్‌పి నుంచి అడ్డంకులు వస్తున్నాయి. ఈ సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించే వరకు సినిమా విడుదల చేయొద్దని విహెచ్‌పి కార్యకర్తలు ఆగ్రహం చెందుతున్నారు. ఈ సినిమాపై కోర్టులో కేసు కూడా విహెచ్‌పీ వారు పెట్టారు. విహెచ్‌పి వారి హెచ్చరికలతో సినిమా విడుదలవడం కష్టమే అంటున్నారు. 
 
అయితే కమల్ హసన్‌కి కోలీవుడ్ నిర్మాతలు మద్దతుగా నిలిచారు. నిర్మతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోను నిలిపేది లేదని, ఖచ్చితంగా మే ఒకటో తేదిన విడుదల చేస్తామని అంటున్నారు. విహెచ్ పీ వారు అనవసరంగా ఈ సినిమా విషయంలో రాద్దాంతం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి నిర్మాతల మద్దతుతో ఉత్తమ విలన్ బయటకు వస్తాడో లేదో చూడాలి.