గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (11:47 IST)

హిందీలో ''కాంచన-2''... నిర్మాతగా తాప్సీ కొత్త అవతారం..!

కోలీవుడ్‌లో ''కాంచన 2''తో హిట్టు కొట్టి, తెలుగులో ''గంగ'' విజయం కోసం ఎదురుచూస్తున్న అందాల తార తాప్సీ. గత కొంత కాలంగా సరైన హిట్లు లేక అవకాశాలు తగ్గడంతో డీలాపడిపోయిన తాప్సీ క్రేజ్ ''కాంచన 2'' మళ్లీ పెంచేసింది. ఇదిలా ఉంటే తాప్సీ కొత్త అవతారం ఎత్తనుందట. నటిగా తన సత్తా చాటుకున్న తాప్సీ చిత్ర నిర్మాత మారనుంది. అది కూడాను తాను నటించిన ''కాంచన 2'' చిత్రం ద్వారానే.
 
కోలీవుడ్‌లో విజయం సాధించిన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రాన్ని తాప్సీనే నిర్మించనుందట.  ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీతో కలసి దీనిని హిందీలో నిర్మించడానికి తాప్సీ సిద్ధమవుతోందట. మరి, అమ్మడు నిర్మాతగా రాణిస్తుందో లేదో వేచి చూడాలి. 
 
కాగా ఇప్పటి హీరోయిన్లు డేరింగ్ స్టెప్స్ తీసుకుంటున్నారు. కేవలం హీరోయిన్లుగానే మిగిలిపోకుండా, సినిమా నిర్మాణంలోకి కూడా దిగుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ ట్రెండ్ కనిపిస్తోంది. జుహీ చావ్లా, అనుష్క శర్మ, ప్రియాంకా చోప్రా వంటి తారలు నిర్మాతలుగా మారిన వైనాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడీ బాటలో తాప్సీ కూడా పయనించడానికి సిద్ధపడుతోంది.