శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : బుధవారం, 13 మే 2015 (13:43 IST)

ఇప్పుడున్న హీరోయిన్లందరూ ఐటం భామలే : దాసరి హాట్ కామెట్స్!

ఉన్నదివున్నట్టు, ముక్కుసూటిగా చెప్పే టాలీవుడ్ దర్శకుల్లో దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు ఒకరు. అయితే, ఈమధ్య కాలంలో ఆయన చేసే వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కోల్‌ స్కామ్‌లో చిక్కుకుని పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆయన.. ఈ స్కామ్‌లో తన గురించి చర్చించకుండా ఉండేందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. 
 
తాజాగా ఆయన నేటితరం హీరోయిన్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సరైన కథానాయిక ఒక్కరు కూడా లేరంటూ ఒక్క ముక్కలో తేల్చిపారేశారు. అంతేకాదు, ప్రస్తుతమున్న హీరోయిన్లు అందరూ నటీమణులు కాదని, కేవలం ఐటెం భామలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
గతంలో ఐటెం సాంగ్స్ చేయడానికంటూ ప్రత్యేకంగా సిల్క్ స్మిత, డిస్కో శాంతి, జ్యోతిలక్ష్మి వంటి వారు ప్రత్యేకంగా ఉండేవారని... ప్రస్తుతం టాప్ పొజిషన్‌లో ఉన్న హీరోయిన్లు కూడా ఐటెం సాంగుల వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. ప్రస్తుతం ఏ హీరోయిన్ కూడా ఐదేళ్లకు మించి ఇండస్ట్రీలో నిలువలేకపోతోందని చెప్పారు.