గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 అక్టోబరు 2014 (12:10 IST)

బక్క హీరో ధనుష్‌తో రొమాన్స్ చేయనున్న త్రిష!

బక్క హీరో ధనుష్‌తో సినిమా చేయలేదనే టాక్ రావడంతో త్రిష ఆ హీరోతో నటించాల్సిందేనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ధనుష్-త్రిష ఈ మధ్య తెగ క్లోజ్‌గా ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఇవి నిజం చేసేటట్లు ధనుష్ చిత్రంలో నటించే ఆఫర్‌ను త్రిష కొట్టేసింది. ఈ ఛాన్స్‌ కోసం త్రిష పేరును ధనుష్ రెకమెండ్ చేశాడట. 
 
గతంలో ధనుష్ నటించిన 'ఆడుగళం' సినిమా కోసం త్రిషను తీసుకున్నప్పటికీ మొదట్లోనే ఆమెను డ్రాప్ చేశారు. ఈ నేపథ్యంలో త్రిష ఇప్పుడు ధనుష్‌తో కలిసి ఓ సినిమాలో నటించనుందనే వార్త కోలీవుడ్‌లో ప్రచారంలో వుంది. 
 
ఇటీవల ధనుష్‌తో 'వేలై ఇల్లా పట్టదారి" చిత్రాన్ని రూపొందించిన వేల్ రాజ్ మళ్లీ ధనుష్ తోనే ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో త్రిషను కథానాయికగా తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ధనుష్ రికమండేషన్ కారణంగానే ఈ చెన్నై ముద్దుగుమ్మకి ఆఫర్ వచ్చినట్లు సమాచారం.