శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (18:27 IST)

సినిమా హిట్టైనా, ఫట్ అయినా పట్టించుకోను: త్రిష

సినిమా హిట్టైనా, ఫట్ అయినా త్రిష పట్టించుకోనని అంటోంది. సినిమాల జయాపజయాల విషయంతో తమకు సంబంధం లేదని చెన్నై సుందరి త్రిష అంటోంది. అందుకే, ఆ ప్రభావం తమపై అంతగా కనిపించదని చెప్పింది. "ఒక సినిమా హిట్టయినా, ఫ్లాపయినా అందులో నటించిన హీరోకే ఎక్కువ క్రెడిట్ వెళుతుంది.
 
ఎందుకంటే, సినిమా బిజినెస్ అతని పేరు మీదే జరుగుతుంది. ఆ తర్వాత దర్శకుడి బాధ్యత వుంటుంది. ఇక మా కథానాయికలకు వాటితో ఏమాత్రం సంబంధం వుండదు. అందుకే, మాకొచ్చే అవకాశాలు మాకు వస్తూనే వుంటాయి. వాటికి సినిమా జయాపజయాలతో సంబంధం వుండదు. 
 
ఒకవేళ బాగా నటిస్తే కనుక, 'ఆ అమ్మాయి బాగా యాక్ట్ చేసింది' అని ఓ కాంప్లిమెంట్ పారేస్తారు" అంటూ త్రిష విశ్లేషించింది. దీంతో హీరోయిన్స్ సేఫ్ అని త్రిష చేతులు దులుపుకుంటోంది. ఇంకేమిటి..? త్రిష చాలా ముదురండోయ్!