గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 20 ఆగస్టు 2014 (15:28 IST)

తెలుగులో హీరోలు రివర్స్‌...

దక్షిణాదిలో తెలుగు చలనచిత్ర రంగ పరిశ్రమ చాలా పెక్యులర్‌గా వుంటుంది. ఇక్కడ బుల్లితెర కంటే వెండితెరకే పెద్దపీట వేస్తారు. బుల్లితెరలో నటిస్తే.. చులకనభావం వుంది. వెండితెరపై వచ్చిన రెమ్యునరేషన్లు చిన్నితెరకు రావు. అందుకే హాయిగా హీరోగా రిటైర్‌ వయస్సులో బుల్లితెరకు అంకితమవుతారు. చాలామంది హీరోయిన్లు, హీరోలు కూడా అదే బాట పడుతుంటారు.
 
నాగార్జున కూడా కోటీశ్వరుడు ప్రోగ్రామ్‌ చేయడానికి కారణం కూడా అదే. ఇప్పుడు సోలో హీరో చిత్రాలు చేసే వయస్సు కాదని, మల్టీస్టారర్‌ చేస్తున్నాడు. కాగా, ఇక్కడికి రివర్స్‌ కన్నడ పరిశ్రమ. అక్కడ హీరోలు బుల్లితెరపై ప్రోగ్రామ్‌కు అటెండ్‌ అయితే... ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతున్నారట. అందుకే హీరోలపై చర్యలు తీసుకోవాలని పలువురు నిర్మాతలు కన్నడ ఫిలింఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు. 
 
అక్కడ హీరోగా పేరుపొందిన నటుడు సుదీప్‌.. ఈగలో విలన్‌గా నటించాడు. ఇంతకీ నిర్మాతల బాధ ఏమిటంటే.. టీవీలో హీరోలు వస్తుంటే.. థియేటర్లకు ప్రేక్షకులు రావడంలేదట. మరి తెలుగుకు రివర్స్‌ కన్నడ ప్రేక్షకులు అన్నమాట.