శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2014 (15:55 IST)

ముకుంద ఫస్ట్ లుక్ రిలీజ్ : చిరు బర్త్ డే రోజున..!

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే రోజున మెగా వారసుడి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం "ముకుంద". ఈ సినిమా ఫస్ట్ లుక్ శుక్రవారం విడుదలైంది. 
 
పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని కొత్తబంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాల ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. 
 
నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో వరుణ్ తేజ్ అదిరిపోయాడని టాక్ వచ్చేసింది.  ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. మెగాస్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశామన్నారు. 
 
సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకుందని.. మిక్కీ.జె. మేయర్ అద్భుతంగా సంగీతం సమకూర్చారన్నారు. సెప్టెంబర్‌లో పాటల్ని, అక్టోబర్‌లో సినిమాను రిలీజ్ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లు నిర్మాత వెల్లడించారు.