శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By IVR
Last Modified: సోమవారం, 30 జూన్ 2014 (18:07 IST)

సాయి వండర్‌ఫుల్‌ హీరోగా ఎదుగుతాడు... 'అల్లుడు శీను' ఆడియోలో వెంకీ

బెల్లంకొండ సురేష్‌ తనయుడ్ని హీరోగా లాంచ్‌ చేయడం గొప్ప విషయం. మా నాన్నగారు నన్ను హీరోగా ఇంట్రడ్యూస్‌ చేసినప్పుడు సాయి లాగా ఇంతే ఆనందంగా ఉన్నాను. సాంగ్స్‌, ట్రైలర్స్‌ చూశాక తెలుగు పరిశ్రమకి సాయి వండర్‌ఫుల్‌ హీరో అవుతాడనిపించింది. వినాయక్‌ రెస్పాన్సిబిలిటీగా ఈ సినిమా చేశారు. టీమందరి ఆల్‌ ద బెస్ట్‌ అని ప్రముఖ కథానాయకుడు విక్టరీ వెంకటేష్‌ అన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అల్లుడు శ్రీను'. 
 
సమంత కథానాయిక. తమన్నా ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది. బెల్లంకొండ సురేష్‌ సమర్పణలో శ్రీలక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బెల్లంకొండ గణేష్‌ బాబు నిర్మిస్తున్నారు. మ్యూజిక్‌ మిసైల్‌ దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఆదివారం శిల్పకళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకటేష్‌ పైవిధంగా స్పందించారు.
 
ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్‌.ఎస్‌.రాజమౌళి, దశరధ్‌, మెహర్‌ రమేష్‌, సంతోష్‌ శ్రీన్‌వాస్‌, బండ్ల గణేష్‌, దిల్‌ రాజు, గోపిచంద్‌ మలినేని, సమంత, ప్రణీత, ఛోటా కె.నాయుడు, మారుతి తదితరులు పాల్గొన్నారు. టీజర్‌ను బ్రహ్మానందం విడుదల చేయగా, థియేట్రికల్‌ ట్రైలర్‌ను రాజమౌళి ఆవిష్కరించారు. విక్టరీ వెంకటేష్‌ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. తొలి సీడీని రాజమౌళి స్వీకరించారు. 
 
రాజమౌళి మాట్లాడుతూ... వినయ్‌ చాలా ఎమోషనల్‌ పర్సన్‌. పేపర్‌లో చిన్న సెంటిమెంట్‌ న్యూస్‌ చదివితేనే కంట తడిపెట్టుకుని రియాక్ట్‌ అవుతారు. ఎనర్జిటిక్‌గా కనిపించినప్పటికీ ఆయన మనసు చాలా సున్నితమైనది. ఆయన దర్శకుడిగా పరిచయమైన ఆది చిత్రం పెద్ద హిట్టైంది. సురేష్‌గారికి లాభాలు తెచ్చిపెట్టింది. అక్కడితో వదిలేయకుండా దర్శకుడిగా మొదటి అవకాశమిచ్చారనే కృతజ్ఞతతో సురేష్‌గారి అబ్బాయిని లాంచ్‌ చేస్తున్నారు. చిరంజీవి గారితో ఠాగూర్‌, ఇతర అగ్ర హీరోలతో ఆయన సినిమాలు చేశారు వినాయక్‌. వాటికంటే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సాయి చాలా లక్కీ పర్సన్‌. పెద్ద నటులే కాకుండా స్టార్‌ టెక్నీషియన్లు ఈ సినిమాకు పనిచేశారు. విడుదల కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నాను. సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుంది అన్నారు.
 
మా నాన్నలానే ఆయన కూడా ఆనందిస్తారు... వి.వి.వినాయక్‌ 
 
డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది కానీ ఖర్చు పెట్టే గట్స్‌ ఉండాలి. సురేష్‌గారు నిర్మాణపరంగా ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఖర్చుపెట్టారు. సినిమా అవుట్‌పుట్‌ కూడా బాగా వచ్చింది. ఆది సినిమా రిలీజ్‌ తరువాత నా సక్సెస్‌ చూసి మా నాన్నగారు ఎంతగా ఆనందపడ్డారో...ఈ సినిమా రిలీజ్‌ తరువాత శ్రీనివాస్‌ సక్సెస్‌ చూసి బెల్లంకొండ సురేష్‌గారు కూడా అంతే ఆనందపడాలి. డెఫినెట్‌గా ఆయన ఆనందిస్తారనే నమ్మకం ఉంది.
 
బాబీ కథ చెప్పగానే నాకు నచ్చింది. అదే సమయంలో అతనికి దర్శకుడిగా అవకాశం రావడంతో ఆ కథను డెవలప్‌ చేసే బాధ్యతను కోన వెంకట్‌ తీసుకున్నారు. గోపిమోహన్‌ చక్కని మాటలిచ్చారు. హీరో  సెంటిమెంట్‌ సీన్స్‌, ఫీల్‌గుడ్‌ సీన్స్‌ బాగా చెయ్యాలని దర్శకుడిగా నేను ఆశించాను. ఆ సన్నివేశాల్ని సాయి అద్భుతంగా పండించాడు. ఫ్యూచర్‌లో అతను పెద్ద స్టార్‌ కావాలని ఆశిస్తున్నాను. 
 
నా గత చిత్రాల్లో పాటల కంటే ఈ సినిమాలో పాటలు విజువల్‌గా చాలా బావుంటాయి. దానికి ముఖ్య కారణం అద్బుతంగా చిత్రీకరించిన చోటాగారు. దేవి ట్యూన్‌ పంపగానే రెండో ట్యూన్‌ అడిగే ఛాన్స్‌ రాలేదు. చక్కని మ్యూజిక్‌ కుదిరింది. తనకున్న స్టార్‌డమ్‌ను ప్రక్కన పెట్టి సురేష్‌గారు అడగ్గానే కొత్త హీరో ప్రక్కన యాక్ట్‌ చేయడానికి రెడీ అయిన సమంతకి, ఓ స్పెషల్‌ సాంగ్‌లో చేసిన తమన్నాకి, ఇతర నటీనటులు-సాంకేతిక నిఫుణులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రెండున్నర గంటల సినిమాలో రెండు గంటలు నవ్వుతూనే ఉంటారు. బ్రహ్మానందం, ప్రకాష్‌రాజ్‌గారి పాత్రలు అద్ముతంగా కుదిరాయి. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుంది అని అన్నారు.
 
ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం... బెల్లంకొండ సాయి 
 
వినాయక్‌ గారి దర్శకత్వంలో నా మొదటి సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. సొంత కొడుకు సినిమాలాగా చేశారాయన. నా పట్ల చాలా కేర్‌ తీసుకున్నారు. డిఎస్‌పికి నేను కూడా పెద్ద ప్యాన్‌ని. నా మొదటి సినిమాకు ఆయన మ్యూజిక్‌ చేయడం ఆనందంగా ఉంది అన్నారు. 
 
వినాయక్‌ చాలా స్వీట్‌ పర్సన్‌... సమంత 
 
డిఎస్‌పి సంగీత సారధ్యంలో పాటల్ని చాలా ఎంజాయ్‌ చేశాను. ఇందులో సీనియర్‌ ఆర్టిస్ట్‌లతో పనిచేశాను. వినాయక్‌ చాలా స్వీట్‌ పర్సన్‌. ఆయనతో మళ్ళీ మళ్ళీ వర్క్‌ చేయాలనిపించింది. సాయిలో మంచి యాక్టర్‌ ఉన్నాడు. అతను స్టార్‌ కావాలనేది నా కోరిక. సురేష్ గారి బ్యానర్‌లో చేస్తున్న మూడో చిత్రమిది. రభస కూడా బాగా వచ్చింది. ఈ రెండు సినిమాల రిలీజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాను అన్నారు.
 
మా కుటుంబం మొత్తం రుణపడి ఉంటాం.... బెల్లంకొండ సురేష్‌... 
 
దర్శకుడిగా అవకాశం ఇచ్చాననే కృతజ్ఞతను ప్రతి విషయంలో చూపిస్తున్నారు వినాయక్‌. నాలుగేళ్ళ క్రితమే మా అబ్బాయిని హీరోగా లాంచ్‌ చేద్దామనే ఆలోచన వచ్చింది. నన్ను మీరు లాంచ్‌ చేశారు. మీ అబ్బాయిని నేను లాంచ్‌ చేస్తానని మాటిచ్చి ఈ సినిమా చేస్తున్నారు. ఏడాదిపాటు మరో సినిమా జోలికి వెళ్ళకుండా ఇదే కథపై కష్టపడ్డారు వినాయక్‌. బాధ్యతతో ఈ సినిమాని డైరెక్ట్‌ చేసిన వినాయక్‌గారికి మా కుటుంబం అంతా రుణపడి ఉంటాం. ఆయన దర్శకత్వంలో మా అబ్బాయిని లాంచ్‌ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. బాబీ చక్కని కథనిచ్చాడు. కోన వెంకట్‌ మాటలు, దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌, ఛోటా ఫోటోగ్రఫి సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి అన్నారు.
 
యూనివర్సెల్‌ హీరో అవుతాడు...దిల్‌ రాజు 
 
'దిల్‌' సినిమాకి ప్రొడ్యూసర్‌ కావడానికి ఆది అనే సినిమా కారణం. ఆ సినిమా నైజాం హక్కులు తీసుకున్నప్పటి నుండి వినాయక్‌తో మంచి రాపో మొదలవ్వడం, ఆ తరువాత మా బ్యానర్‌ని ప్రారంభిస్తానని వినయ్‌ మాటివ్వడం జరిగాయి. ఆది సినిమాతో లక్ష్మీనరసింహ బ్యానర్‌, దిల్‌ సినిమాతో మా బ్యానర్‌ ప్రారంభమయ్యాయి. వినాయక్‌ ప్రారంభించిన మా రెండు బ్యానర్లు సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్నాయి. ఆయన చేతుల మీదుగా బెల్లంకొండ సాయి లాంచ్‌ కావడం మంచి పరిణామం. వినాయక్‌ స్టైల్‌ మాస్‌ మసాలతోపాటు, ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఈ సినిమాలో ఉంటుంది. సాయిశ్రీనివాస్‌ మంచి యూనివర్సెల్‌ హీరో అవుతాడు అన్నారు. 
 
గోపిచంద్‌ మలినేని మాట్లాడుతూ... తొలి సినిమాకే సూపర్‌ టెక్నిషియన్లతో పనిచేయడం సాయిశ్రీనివాస్‌ అదృష్టం. ఇటీవల పాటలు చూశాను డాన్స్‌లు ఇరగదీశారు. వినాయక్‌గారి దర్శకత్వంలో అతనికి మంచి లాంచ్‌ ఇది అని అన్నారు. 
 
ఆయన మనసు వెన్నపూస.... బండ్ల గణేష్‌ 
 
పదేళ్ళ కిందట దర్శకుడిగా అవకాశమిచ్చారనే కృతజ్ఞతతో బెల్లంకొండ సురేష్‌గారబ్బాయిని హీరోగా పరిచయం చేసే బాధ్యను తన భుజాలపై వేసుకుని కృతజ్ఞత తీర్చుకోవడానికి ముందుకొచ్చిన మహా వ్యక్తి వినాయక్‌ అన్న. ఆయన మనసు వెన్నపూస. దర్శకుడిగా మరింత మంచి స్థాయికి చేరుకోవాలని, అలాగే సాయికి హీరోగా మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నాను అని అన్నారు. 
 
వండర్స్‌ని క్రియేట్‌ చేస్తాది... సంతోష్‌ శ్రీన్‌వాస్‌ 
 
వినాయక్‌గారి సినిమాల గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ప్రతి సినిమాలో ఏదొక కొత్తదనాన్ని చూపిస్తారు. నేను ఆయన దగ్గర పనిచేశాను కాబట్టి ఆయన పనితనం నాకు తెలుసు. ఇదే వేదిక మీద బస్టాప్‌ సినిమా గురించి మాట్లాడాను. అది సెన్షేషనల్‌ హిట్‌ అయ్యింది. శ్రీను హీరోగా పరిచయం అవుతున్న అల్లుడుశీను వండర్స్‌ క్రియేట్‌ చేస్తుంది అన్నారు. 
 
అదుర్స్‌లో చారి, కృష్ణలో బాబీ, నాయక్‌ జిలేబి, మరి ఇందులో...   బ్రహ్మానందం 
 
అద్భుతమైన దర్శకుడిచే సాయి హీరోగా పరిచయమవుతున్నాడు. సాంగ్స్‌ ఇరగదీశాడు. ఫైట్స్‌ చంపేశాడు. యాక్టింగ్‌ నరికేశాడు. సమంత లాంటి నాయికతో మొదటి సినిమాలా కాకుండా అద్భుతంగా యాక్ట్‌ చేశాడు. ఈ సినిమాకి ఇరవై రోజులు పనిచేసినందుకు ఆనందిస్తున్నాను. వినాయక్‌ సినిమాల్లో నా కామెడీ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. వాటికి రెట్టింపు ఈ చిత్రంలో ఉంటుంది. అదుర్స్‌లో చారి, కృష్ణలో బాబీ, నాయక్‌ జిలేబి, ఇందులో మరో విచిత్రమైన పేరు. ఫైనల్‌గా అల్లుడు శీను చిత్రం ప్రేక్షకులందరికీ ఫుల్‌ మీల్స్‌లా ఉంటుంది అన్నారు. 
 
నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు : బ్రహ్మానందం, ప్రకాష్‌రాజ్‌, తనికెళ్లభరణి, ప్రదీప్‌రావత్‌, రఘుబాబు, వెన్నెలకిషోర్‌, వేణు,రవిబాబు, ప్రవీణ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎడిటర్‌: గౌతంరాజు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, సాహిత్యం: చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఫైట్స్‌: రామ్‌ లక్ష్మణ్‌, స్టంట్‌శివ, రవివర్మ, వెంకట్‌, డాన్స్‌: రాజసుందరం, ప్రేమ్‌ రక్షిత్‌, గణేష్‌, శేఖర్‌, కథ: కె.యస్‌.రవీంద్రనాథ్‌(బాబీ), కోనవెంకట్‌, డైలాగ్స్‌: కోనవెంకట్‌, సినిమాటోగ్రఫీ: చోటా కె.నాయుడు. నిర్మాత: బెల్లంకొండ గణేష్‌ బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌.