శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 17 డిశెంబరు 2014 (20:27 IST)

మరోసారి జీసెస్‌గా విజయ్‌చందర్‌....

''జీసస్‌ రోల్‌ చేస్తుంటే చాలా మంది వద్దని అప్పట్లో వారించారు. కానీ నన్ను ఓ శక్తి నడిపించింది. ఆ సినిమా నాకు మంచి గుర్తింపు తెచ్చింది. తర్వాత జీసస్‌పాత్రను నేను చేయలేదు. చాలా గ్యాప్‌ తర్వాత మరలా జీసస్‌ పాత్ర చేశాను'' అని విజయ్‌చందర్‌ తెలిపారు. 
 
ఎం.ఎస్‌.ఆర్‌. ఫిలిమ్స్‌ పతాకంపై రూపొందుతున్న సినిమా 'సత్యం వైపు మార్గం'. విజయ్‌చందర్‌, రూపారెడ్డి బసవ, సూర్య, సంధ్యాఝనక్‌, శివ, జయశ్రీ నాయుడు, ముఖేష్‌, ప్రియాంక అగస్టియన్‌, చంద్రశేఖర్‌, నాగబాబు కీలక పాత్రధారులు. ఈ నెల 25న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
సంగీత దర్శకుడు జీవన్‌ థామస్‌ మాట్లాడుతూ... సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. 'కరుణామయుడు'కి సంగీత విభాగంలో పనిచేశాను. ఈ సినిమాకి సంగీతం చేయడం నా అదృష్టం. మంచి కథ ఇది. సందేశం ఉన్న సినిమా. యువతకు చక్కగా కనెక్ట్‌ అవుతుందని తెలిపారు.
 
దర్శకుడు మాట్లాడుతూ... నేను దర్శకత్వం చేసిన తొలి సినిమానే జీసస్‌ మీద చేయడం ఆనందంగా భావిస్తున్నాను. దేవుడంటే ఇష్టం లేని అమ్మాయికి, జీసస్‌ కి మధ్య జరిగే కథ ఇది. సందేశం కూడా వుంది. జీసస్‌ అనగానే అందరికీ విజయ్‌ చందర్‌ గుర్తుకొస్తారు. ఈ సినిమాలో మరోసారి ఆయన జీసస్‌ గా కనిపిస్తారని తెలిపారు.