శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 అక్టోబరు 2014 (13:44 IST)

కత్తి: సమంత-విజయ్ పాటకు రూ.2.5 కోట్ల ఖర్చట.. అవసరమా?

సమంత-విజయ్ జంటగా నటిస్తున్న తమిళ సినిమా కత్తికి భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను తమిళ దర్శకుడు మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం భారీ సెట్లు, భారీ ఎత్తున డ్యాన్సర్లు, పాట కన్నులపండువగా అదిరిపోవడం కామనైపోయింది. ఈ క్రమంలో మురుగదాస్ కూడా రిచ్ నెస్‌కి బాగా అలవాటుపడిపోయాడు. అందుకే, తాను దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ 'కత్తి'లోని ఓ పాటకు ఏకంగా రెండున్నర కోట్లు ఖర్చు పెట్టించాడట.
 
విజయ్, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమా కోసం ఓ పాటను మొదట్లో లండన్లో తీద్దామనుకున్నాడు. అయితే, అది వీలుపడకపోవడంతో ఇటీవల ఆ సాంగును ముంబయ్‌లో సెట్స్‌లో షూట్ చేశాడు.
 
లండన్ వాతావరణాన్ని సెట్‌గా వేయించి భారీతనం ఉట్టిపడేలా ఈ షూటింగ్ చేశాడు. విజయ్, సమంతలతో పాటు ఈ పాటలో ఏభై మంది డ్యాన్సర్లు కూడా పాల్గొన్నారు. అదిసరే కానీ, సినిమాకు చిన్న బడ్జెట్ పెట్టి ఏ పాటు భారీగా ఖర్చు పెట్టడం అవసరమంటారా?