గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (15:38 IST)

దీపావళి పండుగకు కొట్టుకునేందుకు విజయ్ - విక్రమ్ రెడీ

ఈ దీపావళికి తెలుగులో అగ్రహీరోల చిత్రాల పోటీ కంటే.. తమిళనాడులో అగ్రహీరోల పోటీ వుంది. ఇటీవలే శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ట్రైలర్‌ 'ఐ' మంచి ఊపులో వుంది. ఈ చిత్రం ట్రెండ్‌ సృష్టిస్తుందని కొందరు అంటుంటే.... మాస్‌ ప్రేక్షకుల్ని మైమరిపించే విజయ్‌ చిత్రం బ్రేక్‌ చేస్తుందేమోనని అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. 
 
విజయ్‌, సమంత నటించిన 'కత్తి' చర్చకు వచ్చింది. ఇందులో యాక్షన్‌ సీన్స్‌ ఎక్కువగా ట్రైలర్స్‌లో కన్పించాయి. విజయ్‌ ఇందులో కొత్తగా కన్పిస్తాడట. అంతకంటే కొత్తగా 'ఐ'లో విక్రమ్‌ కన్పిస్తాడు. మరి ఏది పోటీకి నిలబడుతుందో కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.