శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 22 జనవరి 2015 (15:13 IST)

విక్రమ్‌ కొత్త ప్రాజెక్ట్‌కు రెడీ అయ్యాడు... సమంత హీరోయిన్...

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన విక్రమ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'ఐ' చిత్రానికి సర్వత్రా అటు ప్రేక్షకుల్లోనూ విమర్శకుల్లోనూ మంచి పేరు తెచ్చుకుంది. అందరూ ప్రశంసించే విధంగా వుండడంతోపాటు విక్రమ్‌ హార్డ్‌వర్క్‌ను మెచ్చుకున్నారు. ప్రస్తుతం విక్రమ్‌ ఐ ప్రమోషన్‌లో బిజీగా వున్నారు. కాగా, తర్వాత చిత్రం ఇంకా ఏమీ అనుకోలేదని ఇటీవలే హైదరాబాద్‌లో ప్రకటించారు.
 
కానీ కొత్త ప్రాజెక్ట్‌లో నటించబోతున్నాడు. 10 ఎన్‌రాద్‌కుల్లా అనే తమిళ చిత్రం కోసం కసరత్తు చేస్తున్నాడు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, ఈ చిత్రం ఇప్పటికే సగానికి పైగా షూటింగ్‌ పూర్తయింది. రెండు పాటలు చిత్రీకరించాల్సి వుంది.
 
వచ్చే నెలలో కోయంబత్తూరు లాస్ట్‌ షెడ్యూల్‌ చేయనున్నారు. కాగా, ఇందులోని పాటలను నేపాల్‌, ఇండోనేషియాలోనూ చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌ చిన్నపాటి యాక్షన్‌తో రూపొందనున్నట్లు తెలుస్తోంది.