మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 25 ఆగస్టు 2014 (20:24 IST)

దీపావళి కానుకగా చియాన్‌ విక్రమ్‌-శంకర్‌ల 'మనోహరుడు'

చియాన్‌ విక్రమ్‌ హీరోగా ఆస్కార్‌ ఫిలిమ్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై గ్రేట్‌ శంకర్‌ దర్శకత్వంలో ఆస్కార్‌ రవిచంద్ర నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఐ'. 180 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్‌ వేల్యూస్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా టెక్నికల్‌గా ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌లో వుంటూ ఇండియన్‌ సినిమాకి వరల్డ్‌వైడ్‌గా ఖ్యాతి తెచ్చాయి. వాటన్నింటినీ మించే స్థాయిలో 'ఐ' చిత్రాన్ని రూపొందిస్తున్నారు శంకర్‌. తెలుగులో ఈ చిత్రాన్ని 'మనోహరుడు' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ని ఒక్కసారి చూసినా శంకర్‌ నుండి మరో విజువల్‌ వండర్‌ రాబోతోందని అందరూ అనుకుంటారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. దీపావళి కానుకగా వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
 
ఈ సందర్భంగా నిర్మాత ఆస్కార్‌ రవిచంద్రన్‌ ఈ చిత్రం గురించి తెలియజేస్తూ - ''శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మరో విజువల్‌ వండర్‌ 'ఐ'. ఈ సినిమా 'ఐ'కి ముందు ఇండియన్‌ సినిమా 'ఐ' తర్వాత ఇండియన్‌ సినిమా అనుకునే రేంజ్‌లో చాలా అద్భుతంగా తీశారు. 180 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. చైనాలో మొత్తం 30,000 థియేటర్లు వుంటే అందులో 15,000 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల అవుతోంది. చాలా భారతీయ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం ఇండియా, మిగతా ఓవర్సీస్‌లలో కలిపి 5,000 థియేటర్లలో రిలీజ్‌ అవుతోంది. టోటల్‌గా 'ఐ' 20,000 థియేటర్లలో రిలీజ్‌ అవుతోంది. 
 
ఇన్ని థియేటర్లలో రిలీజ్‌ అవుతున్న మొట్ట మొదటి ఇండియన్‌ సినిమా ఇదే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన 50 సెకండ్ల ట్రైలర్‌ను కట్‌ చేస్తున్నాం. తను చేసిన ఏ సినిమా గురించీ ఎక్కువగా చెప్పని శంకర్‌ 'అపరిచితుడు' టైమ్‌లో ఫోన్‌ చేసినపుడు ఒకటి, రెండు సార్లు సినిమా డెఫినెట్‌గా పెద్ద హిట్‌ అవుతుందని చెప్పారు. కానీ, ఈ సినిమా విషయంలో మాత్రం 30, 35 సార్లు ఈ సినిమా గురించి నాతో ఫోన్లో చెప్పారు. దీన్నిబట్టి ఈ సినిమా ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చెయ్యబోతోందో అర్థం చేసుకోవచ్చు. 
 
ఈ సినిమాకి రెహమాన్‌ మ్యూజిక్‌ ప్రాణం అని చెప్పాలి. ఆ రేంజ్‌లో ఆయన ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. సాధారణంగా శంకర్‌ సినిమా అంటే ప్రేక్షకుల్లో చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ వుంటాయి. ప్రేక్షకులు ఎక్స్‌పెక్ట్‌ చేసిన దానికంటే ఎన్నో రెట్లు గొప్పగా వుంటుందని నేను కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. తెలుగులో 'మనోహరుడు'గా దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని మీ ముందుకు తెస్తున్నాం'' అన్నారు. 
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.సి.శ్రీరామ్‌, సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఆర్ట్‌: ముత్తురాజు, ఫైట్స్‌: అనల్‌ అరసు, నిర్మాత: ఆస్కార్‌ వి.రవిచంద్రన్‌, దర్శకత్వం: శంకర్‌.