మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (18:17 IST)

విరాట్ కోహ్లీ-అనుష్కలపై సినిమా.. కోహ్లీ బదులు షారూఖ్ ఖాన్!

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్లిమ్ బ్యూటీ అనుష్క శర్మల ప్రేమాయణం తెరకెక్కనుందని వార్తలొచ్చిన సంగతి  తెలిసిందే. బాలీవుడ్‌లో ప్రఖ్యాత ఫిలిం మేకింగ్ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ కోహ్లీ, అనుష్కలతో సినిమా తీయాలని భావించింది. 
 
యశ్ రాజ్ ఫిలింస్ తదుపరి చిత్రం అదేనని మీడియా కూడా తనవంతు ప్రచారం చేసింది. అయితే, తమ తదుపరి చిత్రంలో అనుష్క సరసన కోహ్లీ నటించడం లేదని యశ్ రాజ్ ఫిలింస్ తెలిపింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. 
 
అనుష్కతో సినిమా ద్వారా కోహ్లీని లాంచ్ చేసే ఉద్దేశం లేదని సంస్థ స్పష్టం చేసింది. ఈ రొమాంటిక్ మూవీలో షారుఖ్ ఖాన్‌ను హీరోగా తీసుకున్నట్టు సమాచారం.