శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శనివారం, 22 నవంబరు 2014 (12:53 IST)

వరలక్ష్మితో విశాల్ లవ్ కటీఫ్... శరత్‌కుమార్ ఫైర్

తమిళనాడు సినీ నిర్మాతల సంఘం, నడిగర్ సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్‌కు ప్రముఖ హీరో, నిర్మాత విశాల్‌కు ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నడిగర్ సంఘం సభ్యులపై విశాల్ చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోకుంటే విశాల్‌ను సంఘం నుంచి తొలగిస్తామని శరత్ హెచ్చరిస్తుంటే... విశాల్ కూడా అంతే ధీటుగా అసోసియేషన్ సభ్యులను అవమానించిన వారిని కూడా తొలగిచాలని డిమాండ్ చేస్తున్నాడు. 
 
ఇదిలా ఉంటే విశాల్‌కు శరత్‌కుమార్ మధ్య వార్‌కు వేరే కారణం వినిపిస్తోంది. శరత్‌కుమార్ కూతురు వరలక్ష్మితో విశాల్ లవ్ ఎఫైర్ కొనసాగించి ఇప్పుడు కట్ చేశాడని అందుకే శరత్‌కు విశాల్‌కు ఈ వైరం కొనసాగుతోందని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
కాగా విశాల్ హీరోగా ఇటీవల విడుదలైన పూజ చిత్రంలో రాధిక నటించడంతో వీరిద్దరు చాలా దగ్గరైనట్టు అందరూ అనుకున్నా తాజాగా మాటల దాడులతో మరోసారి పెద్ద అగాధం ఏర్పడింది.