శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2015 (13:45 IST)

తండ్రయిన వివేక్ ఒబెరాయ్.. జెనీలియా అభినందనల ట్వీట్..!

బాలీవుడ్ ప్రముఖ హీరో వివేక్ ఒబెరాయ్. ఈయన దక్షిణాది చిత్ర పరిశ్రమకు అంతగా తెలియకపోయినా ఆ మధ్య విడుదలైన రక్త చరిత్ర చిత్రంతో ఫేమస్ అయ్యారు. పరిటాల రవి నేపథ్యంలో విడుదలైన 'రక్త చరిత్ర' చిత్రంతో ఆయన్ను అభిమానించే వారందరూ వివేక్ ఒబెరాయ్‌ ఫ్యాన్స్ అయ్యారు. అలా దక్షిణాదిన ఫాలోయింగ్ పెంచుకున్న ఒబెరాయ్ ప్రస్తుతం యమా హ్యాపీగా ఉన్నారు. 
 
అందుకు కారణంగా, ఆయన ఇంటిలో మరో కొత్త మెంబర్ వచ్చి చేరారు. ఆయన భార్య ప్రియాంక ఆల్వా మంగళవారం ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఇదివరకే వివేక్ ఒబెరాయ్, ప్రియాంక దంపతులకు వివాన్ ఒబెరాయ్ అనే కుమారుడు ఉండగా, పాప పుట్టడంతో ఆయన మరో సారి తండ్రయ్యాడు.
 
ఈ సంతోషకరమైన వార్తను బొమ్మరిల్లు హీరోయిన్ జెనీలియా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వివేక్ ఒబెరాయ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపింది.
 
'కంగ్రాట్యూలేషన్స్ ప్రియాంకా అండ్ వివేక్ ఒబెరాయ్.. లిటిల్ వీర్ హేజ్ ఏ లిటిల్ సిస్టర్.. సో హ్యాపీ ఫర్ యూ ఆల్.. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్,' అంటూ జెనీలియా ట్విట్ చేసింది. ఇంకా ఈమెతో పాటు పలువురు సినీ ప్రముఖులు, ఒబెరాయ్ దంపతులకు అభినందలు తెలుపుతున్నారు.