గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 21 నవంబరు 2014 (16:39 IST)

'వెల్‌కమ్‌ టు అమెరికా' సెన్సార్‌ పూర్తి - నవంబర్‌ 28 విడుదల

పృథ్వి చంద్ర హీరోగా, దీపికా పర్‌మర్‌, ప్రియాంక హీరోయిన్లుగా క్యాచ్‌ ది ఐ బేనర్‌పై యు.ఎస్‌.రాజు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'వెల్‌కమ్‌ టు అమెరికా'. 'ఇంటర్‌ జంపైనా' అనేది ట్యాగ్‌లైన్‌. గురువారం సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్‌ 28న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. 
 
దర్శకనిర్మాత యు.ఎస్‌.రాజు మాట్లాడుతూ - ''ఒక కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమా ఇది. టాలెంట్‌ వుంటే చదువుతో పనిలేదు, ఎక్కడైనా బ్రతకవచ్చు అని చెప్పే సినిమా ఇది. ఈ పాయింట్‌ని స్క్రీన్‌ మీద చాలా కొత్తగా ప్రజెంట్‌ చేశాం. అది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. అలాగే అమెరికాలోని 64 లొకేషన్స్‌లో ఈ చిత్రం షూట్‌ చెయ్యడం జరిగింది. స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ సినిమాలో మంచి వినోదంతోపాటు మంచి పాటలు కూడా ఆడియన్స్‌ని అలరిస్తాయి. 
 
హీరోగా నటించిన పృథ్విచంద్ర ఈ చిత్రానికి మ్యూజిక్‌ చెయ్యడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు మంచి హిట్‌ అయ్యాయి. గురువారం మా చిత్రానికి సెన్సార్‌ జరిగింది. యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చారు. సెన్సార్‌ సభ్యులు సినిమా చాలా బాగుందని, ఒక మంచి సినిమా చేశారని అప్రిషియేట్‌ చేయడంతో సినిమాపై మాకు వున్న కాన్ఫిడెన్స్‌ రెట్టింపు అయింది. నవంబర్‌ 28న విడుదలవుతున్న ఈ చిత్రం తప్పకుండా ఆడియన్స్‌కి నచ్చుతుంది'' అన్నారు.
 
ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న ప్రముఖ నిర్మాత కె.సురేష్‌బాబు మాట్లాడుతూ - ''వెల్‌కమ్‌ టు అమెరికా సినిమా చాలా బాగుంది. సినిమా చూసిన సెన్సార్‌ మెంబర్స్‌ కూడా సినిమాని చూసి అప్రిషియేట్‌ చేశారు. తెలుగు ఆడియన్స్‌కి ఇది ఒక కొత్త తరహా చిత్రమవుతుంది. ఈ చిత్రం షూటింగ్‌ ఎక్కువ భాగం అమెరికాలోనే జరిగింది. ఇటీవల మా హేమాస్‌ మీడియా ద్వారా విడుదలైన ఈ చిత్రం ఆడియో మంచి విజయాన్ని సాధించింది. పాటలన్నీ కొత్తగా వున్నాయి. 
 
మా హేమాస్‌ మీడియా ద్వారా రిలీజ్‌ అయిన మొదటి అడియో ఇంత పెద్ద విజయం సాధించడం చాలా హ్యాపీగా వుంది. డెఫినెట్‌గా ఈ చిత్రం మంచి హిట్‌ అవుతుందన్న నమ్మకంతోనే మా శివపార్వతి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్‌ ద్వారా రిలీజ్‌ చేస్తున్నాం. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది'' అన్నారు.