గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (14:09 IST)

బాహుబలి సెట్టింగ్‌లో ఫూల్ అయిన తమన్నా.. ఏం జరిగిందంటే?

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న బాహుబలి సినిమా సెట్టింగ్‌లో హీరోయిన్ తమన్నా ఫూల్ అయ్యింది. బాహుబలి మేకింగ్‌లో ఆ సినీ ఆర్టిస్టులకు రాజమౌళి రోజుకో సర్‌‍ప్రైజ్ ఇస్తున్నాడు. ఆతని మేకింగ్ విధానంతో ఆర్టిస్టులంతా ఆశ్చర్యపోతున్నారు. 
 
ఇదే అనుభూతే తమన్నాకు కలిగింది. బాహుబలికి సంబంధించిన ఓ కీలక సన్నివేశాన్ని తమన్నాపై చిత్రీకరించారు. ఈ సన్నివేశం ఓ చెట్టు కింద షూట్ చేయబడింది. భారీ కొమ్మలతో కూడిన ఆ వృక్షాన్ని చూసి తమన్నా నిజమైనా చెట్టే అనుకుంది. 
 
కానీ అసలు విషయం అక్కడే వుంది. ఆ చెట్టును డిజైనర్ సబు సిరిల్ సృష్టించాడని.. తన కళానైపుణ్యం నిజమైన వృక్షం వలె అద్భుతంగా సెట్ చేశాడని తెలిసి తమన్నా షాక్ అయ్యింది. అంతవరకు అది నిజమైనే చెట్టే అనుకుని ఫూల్ అయిన తమన్నాకు అది సెట్టింగ్ అని తెలిసి ఆశ్చర్యపోయింది. 
 
తన కళ్లను తానే నమ్మలేకపోతున్నానని చెప్పింది. అంతేగాకుండా సబు సిరిల్ సృజనాత్మకతను తెలుసుకుని ప్రశంసలతో ముంచెత్తింది.