బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (13:37 IST)

ఎంతవాడు గానీ మూవీ రివ్యూ రిపోర్ట్ : మసాలా కలిపిన గుడ్ ఎంటర్‌టైనర్

సినిమా : ఎంతవాడు గానీ
దర్శకుడు : గౌతమ్ మీనన్ 
నిర్మాత : ఎ.ఎం. రత్నం 
సంగీత దర్శకుడు : హారిస్ జయరాజ్ 
 
ఓ గుడ్ పోలీస్ ఆఫీసర్.. క్రిమినల్స్‌ను ఎదుర్కొనే కథా నేపథ్యంలో ఎంతవాడు గానీ తెరకెక్కింది.
 
కథలోకి వెళితే.. తమిళ సినిమా ఎన్నై అరిందాల్‌కు ఎంతవాడు కానీ డబ్బింగ్ మూవీ. పోలీస్ ఆఫీసర్ చుట్టూ కథంతా తిరుగుతుంది. క్రిమినల్స్‌ను టార్గెట్ చేస్తూ వెళ్ళే ఓ ఐపీఎస్ ఆఫీసర్.. క్లాసికల్ డ్యాన్సర్ అయిన త్రిష ప్రేమలో పడటం జరుగుతుంది. తన తండ్రి అయిన నాజర్‌ను చంపిన క్రిమినల్స్‌ను వేటాడే క్రమంలో త్రిష, మరో హీరోయిన్ అనుష్కలను అజిత్ పెళ్ళి చేసుకున్నాడా? పోలీస్ ఆఫీసర్‌గా, ప్రేమికుడిగానే కాకుండా.. ఓ అమ్మాయికి తండ్రిగానూ అజిత్ ఇందులో కనిపిస్తాడు. ఇక మిగిలిన కథేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 
 
విశ్లేషణ : అజిత్ నటన అదిరిపోయింది. మూవీ సింపుల్‌గా వున్నా అమేజింగ్ అంటూ రివ్యూ టాక్ వచ్చింది. యంగ్ పోలీస్ ఆఫీసర్ ఆ తర్వాత లవర్ ఆ పై ఏడేళ్ల పాపకు తండ్రిగా అజిత్ అతికిపోయాడు. త్రిష, అనుష్క పాత్రకు తగిన మేర సరిపోయారు. కమెడియన్ వివేక్ డీసెంట్ రోల్‌ చేశాడు. అరుణ్ విజయ్ విలన్ రోల్ అద్భుతంగా చేశాడు. 
 
ప్లస్ పాయింట్స్: 
గౌతమ్ మీనన్ దర్శకత్వం, అజిత్ నటన, త్రిష, అనుష్కల ప్రెజెంటేషన్. హారిస్ జయరాజ్ మ్యూజిక్.. కెమెరా పనితీరు. 
 
మైనస్ పాయింట్స్: 
స్క్రీన్ ప్లే సన్నగిల్లింది. తొలిభాగం స్క్రీన్ ప్లే ఆకట్టుకోలేదు. గౌతమ్ మీనన్ మిగిలిన సినిమాలతో పోల్చితే ఇది కాస్త విభిన్నంగా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం ప్రేక్షకుల్లో నిరాశను మిగిల్చింది. అయితే మంచి పోలీస్ ఆఫీసర్ కథను గౌతమ్ మీనన్ విభిన్నంగా ఆవిష్కరించాడు. మొత్తానికి ఎంతవాడు గానీ మసాలా కలిపిన గుడ్ ఎంటర్‌టైనర్‌... అంటూ రివ్యూ రిపోర్ట్ వచ్చేసింది.