అనుష్కను పీకల్లోతు ప్రేమలోకి దించేసిన ఆర్య... అందుకే జెలసీ!

Ganesh|
FILE
అందాల భామ ఎప్పుడూ ఏదో ఒక వార్తతో మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఆమె సినీఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా లవ్ ఎఫైర్స్ చిట్టా బోలెడంత ఉంది. గతంలో ఆమె ఎఫైర్ల జాబితాలో చాలా మంది హీరోలు చేరారు. ఇప్పుడు కొత్తగా ఆ జాబితాలో తమిళ నటుడు చేరాడు.

ఇటీవల వీరిద్దరూ కలిసి 'ఇరాండం ఉలగమ్' (తెలుగులో వర్ణ) చిత్రంలో నటించినప్పటి నుంచీ వీరి మధ్య స్నేహం పెరిగిందని అంటున్నారు. ఇటీవల ఆ స్నేహం ప్రేమగా మారిందని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అనుష్క నటించిన 'సింగం 2' సినిమా విజయం సాధించిన నేపథ్యంలో తాజాగా నిర్మాత ఏర్పాటు చేసిన పార్టీకి ఆర్యాను వెంటబెట్టుకుని వెళ్లిందట అనుష్క. అలాగే, ఇద్దరూ కలిసి హైదరాబాదులో కూడా జంటగా విహరిస్తూ డ్యూయట్ సాంగులు పాడుకుంటున్నారట.

ఆర్యా గురించి అనుష్క...సెట్లో కూల్‌గా ఉండే చాలా మందినే చూశాను కానీ వాళ్ళందరిలోకీ ఆర్య విభిన్నమైన వ్యక్తి. అతనిలో కోపం గానీ, చికాకు గానీ, టెన్షన్ గానీ నేనెప్పుడూ చూడలేదు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటాడు అందుకే నాకు అతన్ని చూస్తుంటే జెలసీగా ఉంటుంది అని చెప్పింది. అయితే ఇది విన్న జనాలు మాత్రం నిండా మునిగిన అనుష్కకి ఆయన అలా కనిపించడంలో తప్పేమీ లేదులే అని సెటైర్లు వేసుకుంటున్నారు.


దీనిపై మరింత చదవండి :