1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

ఆడాళ్లు సెక్స్ గురించి మాట్లాడితే విచ్చలవిడితనమా...?

సెక్సీ చూపుల శ్రేయ చటుక్కున సెక్స్ గురించి మాటలందుకున్నది. ముఖ్యంగా సెక్స్ అంశాన్ని ఆడాళ్లు మాట్లాడితే అదేదో అపరాధం అని సమాజం తప్పుబట్టడంపై క్లాసు పీకింది. సెక్స్ జీవితంలో ఓ అంతర్భాగం, దాని గురించి కానీ, ఇద్దరి మధ్య మొలకెత్తిన రిలేషన్ గురించి కానీ బహిరంగంగా మాట్లాడే స్త్రీలను విచ్చలవిడితనంగా, దారితెన్ను లేనివారిగా విమర్శిస్తుండాన్ని తను సుతారము ఒప్పుకోను అంటోంది. 

సెక్స్ విషయాలను మాట్లాడే ఆడవారిపై ఒక రకమైన ముద్ర వేసేయడం అసంబద్ధమైన విషయం అంటోంది. ఇదే పని మగవారు చేస్తే మాత్రం ఏమీ అనకుండా వదిలేసి ఆడవారిని మాత్రం విచ్చలవిడితనమనే ట్యాగ్ తగిలించడం పాపమని కళ్లు పెద్దవి చేసి మరీ చెపుతోంది.

రిలేషన్‌షిప్‌లో మోసాలుండకూడదనీ, ఇక్కడ సోల్‌మేట్ అనడం పెద్ద పదం అవుతుందనీ పెద్ద పెద్ద డైలాగులు చెప్పుకొచ్చింది. అయితే రిలేషన్‌షిప్ ఉన్నప్పుడు కొంత క్రమశిక్షణను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందనీ, లేని పక్షంలో ఆ బంధం సజావుగా సాగదనీ అంటోంది. ఇంతకీ శ్రేయ అకాస్మాత్తుగా కొత్తగా రిలేషన్స్ గురించి మాట్లాడటం వెనుక ఆంతర్యమేమిటో...?