కమల్ హాసన్ కు శ్రుతి హాసన్ షాక్... 'ఎవడు', 'బలుపు'తో బిజీగా ఉన్నా...

Shruthi Hassan
Venkateswara Rao. I| Last Modified మంగళవారం, 2 ఏప్రియల్ 2013 (16:53 IST)
WD
కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ తండ్రికే షాక్ మీద షాకిచ్చేసిందట. విషయం ఏంటయా అంటే, కమల్ హాసన్ తన తదుపరి చిత్రం బిటర్ చాక్లెట్ తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ ను నటింపజేయాలని తలచి ఆమె డేట్స్ అడిగాడట.

శ్రుతి హాసన్ ఎంతమాత్రం తడుముకోకుండా నో డాడ్... నేను ఎవడు, బలుపు ఇంకా నాలుగు చిత్రాల షూటింగులతో బిజీగా ఉన్నా. ఈ దశలో కాల్షీట్లు ఇవ్వలేనని ముఖం మీదే చెప్పేసిందట. దీంతో కమల్ హాసన్ అవాక్కయ్యాడట.

అదేంటి శ్రుతీ... డాడీకి అలా నో చెప్పాశావ్ అని అడిగితే... చాలా బాధగా ఉన్నా చాలాచాలా హ్యాపీగా ఉన్నదని అంటోందట. ఎందుకంత హ్యాపీ అని అడిగితే... నాన్న అడిగితే బిజీగా ఉన్నానని చెప్పానే అందుకే... అంటూ నిజానికి నేను హిందీ, తెలుగు, తమిళ చిత్రాలతో మహా బిజీగానే ఉన్నానండీ అంటోందట ఈ సుందరి.


దీనిపై మరింత చదవండి :