1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

సల్మాన్ - కత్రినా చాటుమాటు ప్రేమాయణం...?!!

"వీర్" చిత్రం తాలూకు ప్రివ్యూను చూసిన సినీ ప్రముఖులు సల్మాన్ బాడీ లాంగ్వేజ్ సూపర్ అని తెగ పొగిడేసే సరికి సల్మాన్ విర్రవీగిపోతున్నాడట. ఆ ఆనందాన్ని పైకి చెప్పకపోయినా ఇంటికెళ్లి రాత్రిళ్లు పొద్దుపోయే వరకూ పార్టీలలో మునిగి తేలుతున్నాడట. ఇదిలావుంటే సల్మాన్‌కు ఎన్నో రోజులుగా దూరంగా ఉంటున్న ఓ గొంతు అకస్మాత్తుగా పలుకరించిందట. అంతేకాదు పాత పరిచయాన్ని మరోసారి గుర్తు చేసి గారాలు పోయిందట. ఆ గారాలను చూసి సల్మాన్ గాలిలో తేలిపోతున్నాడట.

అన్నట్లు ఆ గొంతు ఎవరిదో చెప్పలేదు కదూ...!! ఆమె సల్మాన్ ఖాన్ ప్రియురాలు కత్రినా కైఫ్. గత కొన్ని నెలలుగా సల్మాన్ ఖాన్ పేరు చెబితేనే తప్పించుక తిరుగుతున్న కత్రినా తాజాగా సల్మాన్‌తో తిరిగి ప్రేమాయణం సాగిస్తోందని బాలీవుడ్ కోడై కూస్తోంది.

సల్మాన్ వీర్ చిత్రం చూసిన తర్వాత అందరూ కండల వీరుడ్ని పొగడ్తలతో ముంచెత్తుతుండటంతో కత్రినా కూడా తనవంతు అభినందనలు తెలిపుతూనే పనిలోపనిగా పాత గురుతులను ఏకరవు పెట్టినట్లు బాలీవుడ్ సినీ వర్గాల భోగట్టా. కానీ కత్రినా కైఫ్ సన్నిహితులు మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. సల్మాన్ ఖాన్‌ను కలలో కూడా కత్రినా పలుకరించదని అంటున్నారు.