శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Modified: బుధవారం, 27 మే 2015 (19:58 IST)

మళ్ళీ ఆర్తీ నటిస్తోంది... ఏ పాత్రలోనో తెలుసా...?

నటి ఆర్తీఅగర్వాల్‌ మళ్ళీ శివనాగు దర్శకత్వంలో నటించనుంది. గతంలో ఆయన దర్శకత్వంలో ఆయన కొడుకు హీరోగా రూపొందిన చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించింది. అటవీ నేపథ్యంలో ఆ చిత్రం సాగింది. తాజాగా మళ్ళీ ఆయన దర్శకత్వంలో చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈసారి ద్విపాత్రాభినయం చేయనుంది. చల్లా సుబ్రమ్మణ్యం రచించిన 'క్యాబరే డాన్సర్‌' అనే నవల ఆధారంగా ఈ చిత్రం ఉంటుందని ఫిలింనగర్‌ కథనాలు విన్పిస్తున్నాయి.
 
ఈ చిత్రకథ జయమాలిని జీవితానికి దగ్గరగా వుంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన చిత్రాలను పరిశీలిస్తోంది. వెంకటేష్‌తో 'నువ్వునాకు నచ్చావ్‌' ద్వారా టాలీవుడ్‌కు పరిచయమై, ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాలు చేసిన ఆర్తీ కెరీర్.. ఒక్కసారిగా పడిపోయింది. ప్రేమ, పెండ్లి వంటి విషయాల్లో జరిగిన సంఘటనలు ఆమె నటనా జీవితాన్ని తొక్కేశాయి. అయితే ఈసారి తన కెరీర్‌పై మరింత నమ్మకంతో వుందని తెలుస్తోంది.