బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By PNR
Last Updated : మంగళవారం, 23 సెప్టెంబరు 2014 (14:16 IST)

ఎట్టకేలకు తెలుగుపై దృష్టి కేంద్రీకరించిన సమంత!

తమిళంలో 'అంజాన్' చిత్రంతో ఎదురుదెబ్బ తగలడంతో టాలీవుడ్ బ్యూటీ సమంత చూపు తిరిగి తెలుగు చిత్ర పరిశ్రమ వైపు పడింది. అత్తారింటికి దారేది చిత్రం షూటింగ్ ముగిసిన తర్వాత తెలుగులో ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. తమిళంలో అంగీకరించిన చిత్రాలతో బిజీగా మారిన ఈమె.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు సినిమా షూటింగులో పాల్గొననుంది. 
 
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కోసం ఈ చిన్నది అక్టోబర్ 1 నుంచి డేట్స్ కేటాయించింది. 'అత్తారింటికి దారేది' సినిమా తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో సమంతా ఈ సినిమా కోసం జతకడుతుండగా.... అల్లు అర్జున్ సరసన మాత్రం తొలిసారిగా నటిస్తోంది.
 
ఇక ప్రస్తుతం తాను విజయ్ హీరోగా రూపొందుతున్న 'కత్తి' తమిళ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం సమంతా నెల్లూరులో ఉంది. అక్కడ క్లైమాక్స్ దృశ్యాలను దర్శకుడు మురుగదాస్ భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు. కాగా, ఇటీవల సూర్యాతో కలసి సమంతా నటించిన 'అంజాన్' సినిమా భారీ అపజయాన్ని నమోదు చేసిన సంగతి విదితమే!