Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నన్ను సంతృప్తి పరిచేవారెవరైనా ఉన్నారా..! సమంత

బుధవారం, 5 జులై 2017 (12:43 IST)

Widgets Magazine

సమంత. వయస్సుల్లో చిన్నదైనా సినిమాల్లో మాత్రం పెద్ద పెద్ద క్యారెక్టర్లతో ప్రేక్షకుల మదిని దోచుకుంది. అటు తమిళం, ఇటు తెలుగు రెండు బాషల్లోనూ అగ్రహీరోయిన్లలో ఒకరుగా సమంత ప్రస్తుతం ముందుకు దూసుకెళుతోంది. "మనం" చిత్రంతో నాగార్జున కుమారుడు నాగచైతన్యతో ప్రేమలో పడిన ఈ అమ్మడు ఆ తర్వాత మెల్లమెల్లగా సినిమాలను తగ్గించింది. ఇద్దరు ప్రేమికులు చట్టాపట్టాలేసుకుని తిరగడంలో బిజీ అయిపోయారు. అయితే వీరి నిశ్చితార్థం జరిగిపోయిన తర్వాత మళ్ళీ సమంత సినిమాల్లో నటించడం ప్రారంభిస్తున్నారు. 
 
గత సంవత్సరం నాలుగు సినిమాల్లో నటించి అన్ని విజయాలను కైవసం చేసుకున్న సమంత ఈ యేడాది కూడా అదే దూకుడుతో ముందుకెళుతోంది. రాంచరణ్‌తో "రంగస్థలం 1985", "రాజుగారి గది-2" సినిమాల్లో ప్రస్తుతం బిజీగా నటిస్తోంది సమంత. ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్లు చేసిన సమంతకు సంతృప్తి లేదని చెబుతోంది. కొన్ని క్యారెక్టర్లలో ఇంకా నటించాలన్న కోరిక తనకు ఇప్పటికీ ఉందని, ఎప్పుడు ఆ కోరిక నెరవేరుతుందో తెలియడం లేదంటోంది ఈ సొట్టబుగ్గల సుందరి. 
 
మౌనంగానే ఎదగమని.. మొక్క నీకు చెబుతోంది అన్న సామెతలాగా సమంత కూడా ఎన్ని క్యారెక్టర్లు చేసి.. ఎంత పేరు వచ్చినా తనకు మాత్రం ఇంకా కొన్ని క్యారెక్టర్లు చేయాలన్న కోరిక ఉండడంపై తెలుగు సినీపరిశ్రమ చెవులు కొరుక్కుంటున్నాయి. తాను కోరుకున్న క్యారెక్టర్లు ఇచ్చే దర్శకులు ఎవరైనా ఉన్నారా అని సమంత వెతుకుతోందట. మరి ఈ యేడాదైనా సమంత కోరిక తీరుతుందో లేదో చూడాలి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ సాధ్యమా...!

వివాదాలకు మారుపేరు రాంగోపాల్ వర్మ. ఇప్పటికే రక్తచరిత్ర పేరుతో అనంతపురం ఫ్యాక్షనిజం, ఆ ...

news

కన్నడ కురుక్షేత్రలో ద్రౌపదిగా నయనతార?

మలయాళంలో మహాభారతం ఆధారంగా మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న ...

news

''ఒకే ఒక్కడు '' తరహాలో కమల్ హాసన్‌ను తమిళనాడుకు సీఎంగా చేయండి: ప్రేమమ్ ఆల్ఫోన్స్

అర్జున్ నటించిన ఒకే ఒక్కడు సినిమా గుర్తుందా? ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ...

news

వానపాటలంటే భలే చిరాకు.. దుస్తులు మార్చుకోవాలంటే.. పొదలు, చెట్లే శరణ్యం: శ్రీదేవి

అతిలోకసుందరి శ్రీదేవి అప్పటి షూటింగ్ లొకేషన్లు, విషయాలను గుర్తుచేసుకుంది. ప్రస్తుతం మామ్ ...

Widgets Magazine