బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శనివారం, 29 అక్టోబరు 2016 (11:23 IST)

ఐష్ - రణ్‌బీర్ హాట్ సీన్లు లేవట.. ''ఏ దిల్ హై ముష్కిల్'' చూసి ఊపిరిపీల్చుకున్న బచ్చన్ ఫ్యామిలీ

ఈ యేడాది దేశ‌వ్యాప్తంగా అంద‌రూ మాట్లాడుకున్న సినిమా ''ఏ దిల్ హై ముష్కిల్''. యురీ ఉగ్రదాడుల నేపథ్యంలో పాకిస్థాన్ నటుడు ఫవద్ ఖాన్ నటించిన ఈ సినిమా విడుదలకు దేశ‌వ్యాప్తంగా పెద్ద అడ్డంకులు ఎదుర‌య్యాయి. చి

ఈ యేడాది దేశ‌వ్యాప్తంగా అంద‌రూ మాట్లాడుకున్న సినిమా ''ఏ దిల్ హై ముష్కిల్''. యురీ ఉగ్రదాడుల నేపథ్యంలో పాకిస్థాన్ నటుడు ఫవద్ ఖాన్ నటించిన ఈ సినిమా విడుదలకు దేశ‌వ్యాప్తంగా పెద్ద అడ్డంకులు ఎదుర‌య్యాయి. చివ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం సైతం ఈ సినిమా విడుదల విష‌యంలో జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది. ఎన్నో అడ్డంకులు దాటుకుని భారీ ప‌బ్లిసిటీ, అంచ‌నాల మ‌ధ్య శుక్రవారం విడుదలైంది. 
 
ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ సరసన మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యరాయ్, అనుష్క శర్మ నటించింది. అయితే ఐష్ - రణ్‌బీర్ మధ్య హాట్ సీన్స్ ఉండటం బచ్చన్ ఫ్యామిలీకి కోపాన్ని తెప్పించిందనే వార్తలు వినిపించింది. అందువల్లనే ప్రీమియర్ షోకి ఎవరూ హాజరుకాలేదని గుసగుసలు వినిపించాయి.
 
దాంతో ఈ సినిమాను బచ్చన్ ఫ్యామిలీ చూస్తుందా చూడదా అనే సందేహాలు అందరిలోను నెలకొంది. అయితే అందరికి ఆశ్చర్యం కలిగేట్టు... వాళ్లంతా కూడా ఈ సినిమా చూసేశారట. విడుదలకి ముందే బచ్చన్ ఫ్యామిలీ కోసం... రాయ్ ఫ్యామిలీ కోసం ఐశ్వర్యరాయ్ ఈ సినిమా స్పెషల్ షో వేయించిందని అంటున్నారు. ఈ సినిమాలో ఐష్ పాత్రను చూసి వాళ్లంతా తేలికగా ఊపిరి పీల్చుకున్నారని సమాచారం.