శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : మంగళవారం, 28 జూన్ 2016 (09:20 IST)

అలీ నోటిదూల.. షూటింగ్ లేదంటే.. డ్రాయర్ మీదే రూమ్‌కు వెళ్లిపోయే వాళ్ళం!

క‌మెడీయ‌న్ అలీ ఇటీవల శృతి మించి మాట్లాడుతున్నాడు. కమిడియన్‌గా కాకుండా ఆడియో ఫంక్ష‌న్‌ల‌కు యాంకర్‌గా అలీ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అవార్డు ఫంక్షన్ల కార్య‌క్రమాల్లో పాల్గొనే హీరోయిన్లపై హాట్

క‌మెడీయ‌న్ అలీ ఇటీవల శృతి మించి మాట్లాడుతున్నాడు. కమిడియన్‌గా కాకుండా ఆడియో ఫంక్ష‌న్‌ల‌కు యాంకర్‌గా అలీ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అవార్డు ఫంక్షన్ల కార్య‌క్రమాల్లో పాల్గొనే హీరోయిన్లపై హాట్‌హాట్‌గా కామెంట్లు చేస్తూ ఎప్పుడూ వార్త‌ల్లో నిలుస్తూ… వివాదాల‌పాల‌వుతున్నాడు. ఇండ‌స్ట్రీలో బ్ర‌హ్మానందం త‌రువాత.. అంతటి స్టార్ స్టేట‌స్ సంపాదించాడు అలీ. కొంత‌కాలం నుంచీ అత‌డి వ్య‌వ‌హార శైలిపై ముఖ్యంగా.. ఆడియో ఫంక్ష‌న్స్‌లో మ‌నోడు చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టికే అనేక‌ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 
 
పెదాల విరుపులు… డ‌బుల్ మీనింగ్ డైలాగుల‌తో.. ఆడ, మగా అని తేడా లేకుండా అంద‌రిపై కామెంట్లు చేస్తూ విమ‌ర్శ‌ల పాల‌వుతున్నాడు. అయితే ప‌రిశ్ర‌మ‌లో ఎంతోకాలంనుంచీ క‌మీడియన్‌గా ఉంటున్నాడు కనుక ఎవ‌రూ అత‌డి మాట‌ల‌ను పెద్దగా సీరియస్‌గా తీసుకోవ‌డంలేదు… కానీ ప్రేక్ష‌కులు, మాత్రం.. ఈ అడల్ట్ జోక్స్‌కి తీవ్ర ఇబ్బంది ప‌డుతున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా అటువంటి `ఏ` స‌ర్టిఫైడ్ జోకుల‌ను వ‌దిలేయాల‌ని కోరుతున్నారు. 
 
గతంలో ఒక ఆడియో వేడుకలో సుమ, అల్లు అరవింద్‌పై ఘాటు విమర్శలు చేయడంతో ఒక్క సారిగా హాట్ టాపిక్ అయ్యాడు ఆలీ. ఈ కామెంట్ విని అదేంటి ఆలీ ఇలా అనేసాడు అని అనుకోనివారులేదు. కొందరు ఈ కామెంట్‌పై సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. తాజాగా సాయి ధరమ్ తేజ్ సినిమా "తిక్క" పోస్టర్ రిలీజ్ ఫంక్షన్‌కు విచ్చేసిన అలీ మరో సారి ఇలాంటి హాట్  కామెంట్స్ ''ఏ'' చేసాడు. 
 
ముందుగా తాను ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ మలేషియాలో జరిగినప్పుడు డైరెక్టర్ ఈ రోజు షూట్ లేదు సార్ అనగానే బట్టలు మార్చకుండానే డ్రాయర్ మీదే రూంకు వెళ్లిపోయే వాళ్ళం. హీరోయిన్స్ అంటే అంటూ ఒక్కసారిగా హా? అంటూ సెటైర్లు వేశాడు. తనదైన శైలిలో స్పందిస్తూ... కాస్త హాట్ కామెంట్ చెయ్యడంతో అలీ మాటలకు నవ్వినా ఈ కమెడియన్ ఇక ఏ హాట్ కామెంట్స్‌కు పులిస్టాప్ పెట్టరాని అని మనసులో తిట్టుకోని వాళ్లు కూడా లేకపోలేదు సుమా...!