Widgets Magazine

శింబు, ప్రభుదేవాలను కాదన్న నయనతార విఘ్నేష్‌తో జత కట్టేనా...

హైదరాబాద్, గురువారం, 29 జూన్ 2017 (07:18 IST)

Widgets Magazine
nayanatara-vignesh

ప్రేమికుడు ఎంత గొప్పవాడయినా సరే అమర్యాదకరంగా వ్యవహరిస్తే చాలు తన్ని తరిమేసే సాహసం నయనతారది. గతంలో ఇలాగే ఆమెకు దగ్గరై పోకిరీ పని చేసిన తమిళ హీరో శింబును పదేళ్లు తన వద్దకు కూడా రాకుండా చేసింది నయనతార. ఇక ప్రభుదేవా అయితే తన భార్య పిల్లలను పణంగా పెట్టి వివాహ బంధం కూడా తెంచుకుని నయన చెంతకు చేరాడు కానీ ఏం తేడా వచ్చిందో తెలీదు. ఆరునెలల్లోపే జాడించేసింది. అలాంటిది తనకంటే ఏడాది చిన్నవాడైన విఘ్నేష్‌‌తో ప్రేమలో పడింది. ఖచ్చితంగా వీరిద్దరూ ఒకటవుతారని కొలీవుడ్ కోడై కూస్తోంది. 
 
కంటే వయసులో ఏడాది చిన్నోడయినా... బోలెడంత ప్రేమను నయనకు పంచి, ఆమె ప్రేమను సంపాదించి ఒక్కసారిగా వార్తల్లో పెద్దోడయ్యాడు తమిళ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌. సాయంత్రం వేళకు ఓ గూటికి చేరే పక్షుల వలే... సన్‌ సెట్‌ కాగానే సినిమా సెట్‌ నుంచి విఘ్నేశ్, నయనలు స్ట్రయిట్‌గా ఓ గూటికి చేరి కబుర్లు చెప్పుకుంటున్నారట. చెన్నై కోడంబాక్కమ్‌ వర్గాలు వీళ్ల ప్రేమకథ గురించి కథలు కథలుగా చెబుతున్నాయి.
 
 వీళ్లిద్దరూ ఈ కథలకు తగ్గట్టుగా మలయాళీ ఓనమ్, తమిళ పొంగల్‌ ఫెస్టివల్స్‌ను కలిసే సెలబ్రేట్‌ చేసుకున్నారు. ప్రేమలో ఆల్మోస్ట్‌ రెండేళ్లు గడిచాయేమో... మూడో ఏడు వచ్చేసరికి ఏడడుగులు వేసేయాలని విఘ్నేశ్, నయనలు నిశ్చయించుకున్నారని వార్తలొచ్చాయి. అబ్బే... అటువంటిది ఏం లేదని విఘ్నేష్‌ శివన్‌ క్లారిటీ ఇచ్చారు.
 
 ప్రస్తుతానికి కెరీర్‌ గురించి తప్ప... కల్యాణం గురించి ఆలోచించడం లేదని ఆయన సెలవిచ్చారు. అంతా బాగానే ఉంది.. ‘నయనతారను నేనెందుకు పెళ్లి చేసుకుంటాను’ అనలేదు కాబట్టి, ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్న మాట నిజమే అన్నమాట. ఏదేమైనా... ఇప్పట్లో నయనతార పెళ్లి లేనట్లే!! ఇంకో మూడు నాలుగేళ్లు కెరీర్‌పైనే దృష్టి పెడతారన్నమాట!
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
నయనతార విగ్నేష్ శివన్ ప్రేమ పెళ్లి Love Marriage Nayanathara Vignesh Sivan

Loading comments ...

తెలుగు సినిమా

news

రాజమౌళి రెండో సినిమా మహేష్ బాబుతోనేనట.. మరి తొలి సినిమా.. ఎన్టీఆర్ తోనా డౌటే?

బాహుబలి2 అఖండ విజయం తర్వాత రెండు నెలలుగా విరామం తీసుకుంటున్న దర్శక ధీరుడు రాజమౌళి ...

news

విడిపోయాక అమలాపాల్ మరీ తెలివి మీరిపోయిందా.. ధనుష్‌కే గాలమేసిందే?

ఇష్టపడి ప్రేమించి పెళ్లాడిన దర్శకుడు విజయ్‌తో సంబంధం స్వల్పకాలానికే తెగిపోవడంతో మళ్లీ ...

news

పవన్ కళ్యాణ్ గురించి మూడు ముక్కలడిగిన రానా... జక్కన్న ఆన్సర్స్ అదుర్స్

ఒకవైపు ఏపీ ఎన్నికల సమీపిస్తున్నాయి. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ కోసం అభ్యర్థుల ...

news

మహేష్ కోసం బాలీవుడ్ నుంచి వచ్చేసిన బ్యూటీ స్టార్... ఎందుకు?

ప్రిన్స్ మహేష్ బాబు స్పైడర్ చిత్రం తర్వాత తదుపరి చిత్రం భరత్ అను నేను కొరటాల శివ ...