Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అందాలను ఆరబోయాలి కానీ అన్నీ చూపిస్తే ఎలా అన్నారట అనసూయను...

శుక్రవారం, 7 జులై 2017 (12:29 IST)

Widgets Magazine

బుల్లితెర యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది అనసూయ. జబర్దస్త్‌తో కుర్రకారును హోరెత్తించిన ఈ అందాల భామ ఆ తరువాత అడపాదడపా సినిమాల్లోను నటించింది. చేసిన సినిమాల్లోను తన ప్రతిభను కనబరిచి అందరినీ ఆకట్టుకుంది. నాగార్జునతో మూడవ హీరోయిన్‌గా చేసిన అనసూయను చూసిన ప్రేక్షకులు ముక్కున వేలేసుకున్నారు. పెళ్ళయి ఒక కొడుకున్న అనసూయలో ఏ మాత్రం గ్లామర్ తగ్గిపోలేదని తెలుగు సినీవర్గాలు చెవులు కొరుక్కున్నాయి. అయితే ఆ తరువాత అనసూయకు పెద్దగా సినిమాల్లో ఛాన్సులు రాలేదు. కారణం ఆమె దర్శకులు చెప్పినట్లుగా చేయకపోవడం వల్లనేనట. 
anasuya
 
సినిమా అంటేనే చాలామంది కుర్రకారు హీరోయిన్ల నుంచి సైడ్ ఆర్టిస్టుల నుంచి అందాలను చూసేందుకు ఇష్టపడతారు. ఇక అనసూయ లాంటి వారి గురించి అయితే అస్సలు చెప్పనక్కర్లేదు. అలాంటి అనసూయ సినిమాల్లో నటిస్తుండటంతో హాట్ హాట్ సీన్లు ఉండాలనుకుంటుంటారు ప్రేక్షకులు. అయితే ఆ హాట్ సీన్లకు ఏ మాత్రం ఒప్పుకోలేదట అనసూయ. నాగార్జునతో నటించిన సినిమాలోనే ఓణీ ధరించిన ఈ అమ్మడు ఆ తరువాత కుటుంబ సభ్యుల నుంచి క్లాస్ తీసుకుందట. అందాలను ఆరబోయాలి కానీ అన్నీ చూపిస్తే ఎలా అని ప్రశ్నించారట. దీంతో అనసూయ తనకంటూ కొన్ని హద్దులు పెట్టుకుందట. 
 
బికినీలు అస్సలు వేసుకోకూడదని, దాంతో పాటు అందాలను అస్సలు ఆరబోయకూడదని. ఇలాంటి సీన్లలో నటించమని మాత్రం అడిగితే అలాంటి సినిమాలే తనకు అక్కర్లేదని చెబుతోందట. అందుకే అనసూయ తిరిగి బుల్లితెరకే పరిమితమైంది. ప్రస్తుతం బుల్లితెరల్లోనే ఎక్కువగా కనిపిస్తున్న అనసూయ వెండితెరలో కనిపించకుండా పోవడానికి ఇదే ప్రధాన కారణమట. మరి అనసూయ ఇలాగే కొనసాగితే వెండితెరకు దూరమవ్వాల్సిన పరిస్థితి తప్పదేమో..?Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మద్యం సేవించి అతివేగంతో కారు నడిపి ఆమె మృతి కారణమయ్యాడు.. యువ హీరో అరెస్టు

బెంగాల్ పోలీసుల యువ హీరోను అరెస్టు చేశారు. బెంగాలీ మోడల్, యాంకర్ సోనికా సింగ్ మృతి కేసులో ...

news

బర్త్‌డే పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేసి ఐస్ క్రీమ్ బ్యూటీ...

తేజస్వి మడివాడ. 2013 లో వెండితెర‌కి పరిచయమైన బ్యూటీ. 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు' ...

news

శంకరాచార్యపై సినిమా తీస్తారా.. ఆయన నోరిప్పితే కదా..

కంచిపీఠంలో 2004లో జరిగిన ఆలయ మేనేజర్ శంకర రామన్ హత్య, ఆ తరువాత పరిణామాలు పీఠాధిపతి ...

news

ఇంతయితే చేస్తా అన్న దీపిక.. పారిపోతున్న నిర్మాతలు.. ఎందుకూ?

దక్షిణ భారత చిత్రపరిశ్రమ బాలీవుడ్‌పై వేసిన తిరుగులేని స్టాంప్‌లలో దీపికా పడుకొనే ఒకరు. ...

Widgets Magazine