Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లాస్యను మరిచిపోను.. రాసుకుంటే రాసుకోండి.. వెంట్రుకతో సమానం: రవి

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (15:07 IST)

Widgets Magazine

బుల్లితెర యాంకర్ లాస్యకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిశ్చితార్థ వేడుకలో సహ యాంకర్ రవి ఏడ్చేశాడని వార్తలొచ్చాయి. లాస్యను పక్కన బెట్టి శ్రీముఖితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన రవితో బ్రేకప్ అయ్యాక లాస్య వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే లాస్య-శ్రీముఖిలతో తన పేరును లింక్ చేస్తూ వస్తున్న రూమర్లపై సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహించిన రవి కోపంగా సమాధానమిచ్చాడు. 
 
ఫ్యాన్స్ వేసిన కొన్ని ప్రశ్నలకు రవి సమాధానమిస్తూ.. లాస్యను మరిచిపోయే ప్రసక్తే లేదని, ఆమె మంచి స్నేహితురాలని రవి చెప్పాడు. తనతో టచ్‌లో ఉంటున్నానని, లాస్య త్వరలోనే ‘రాజా మీరు కేక’ అనే సినిమాతో మన ముందుకు వస్తుందని, ఆ సినిమా కోసం తాను కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నట్టు చెప్పాడు. 
 
తనకు ఆమెకు ఏదో ఉందని నెగటివ్‌గా రాస్తున్నారు. నెగటివ్ విషయాలను తాను పెద్దగా పట్టించుకోను. నెగటివ్ వార్తలను వెంట్రుకతో సమానంగా తీసిపారేస్తానని చెప్పాడు. ఇక శ్రీముఖి తనకు మంచి కొలీగ్ అని, తామంతా షోలో భాగంగానే అలా బిహేవ్ చేస్తాం తప్ప, ముద్దులు పెట్టుకోవడం, తన్నుకోవడం వంటివి కేవలం షోలో భాగంగానే చేస్తాం తప్ప, వేరే ఉద్దేశం లేదని రవి చెప్పాడు. తమ గురించి నెగటివ్‌గా రాస్తే అది ప్రమోషన్‌కు పనికొస్తుందని, టీవీల్లో కనిపించే మా గురించి ఫ్యాన్స్ మాట్లాడుకుంటారని.. అది నెగటివ్ అయినా తమకు ప్లస్సే అవుతుందని రవి అన్నాడు. 
 
ఇక బయట ఈవెంట్స్ కి కూడా తాము ముందుగానే మాట్లాడుకునే వెళ్తాం తప్పా, బయట వాళ్ళు అనుకున్నట్టు ఏమీ ఉండదని రవి తెలిపాడు. అంతే కాదు మేము పక్కా ప్రొఫెషనల్ అని కూడా ఆవేశంగా రవి చెప్పాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Clarifies Controversy Lasya Anchor Ravi Sri Mukhi

Loading comments ...

తెలుగు సినిమా

news

అనుపమ పరమేశ్వర్ ఆ హీరో నైట్ పార్టీలు... ఆ కిక్కుతో ఇద్దరూ ఎంజాయ్...

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుపమ పరమేశ్వర్ పేరు మారుమ్రోగుతోంది. శతమానం భవతి చిత్రం ...

news

పవన్ కళ్యాణ్ - కొరటాల శివ కాంబినేషన్‌లో పవర్‌ఫుల్ మూవీ...

కొరటాల శివ. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ...

news

లాస్య ఎంగేజ్‌మెంట్‌లో ఏడ్చేసిన రవి.. మంజునాథ్‌‌కు వందల కోట్ల ఆస్తులున్నాయట..!

బుల్లితెర నటీమణి లాస్యకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. బుల్లితెరకు దూరమై ఒక సినిమా ...

news

బ్రహ్మీతో కాంబినేషన్.. అప్పుడే బ్లూ ఫిలిమ్ ఆఫర్స్ వచ్చాయి..సమంత, తమన్నా అలా?: రమ్య శ్రీ

శృంగార తార, నటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులనైన రమ్యశ్రీ ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కు ...

Widgets Magazine