Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీముఖిని బుద్ధున్నోడు ఎవడైనా లవ్ చేస్తాడా? నీ చేతిలో రిమోట్ ఉందిరా అయ్యా?

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (16:37 IST)

Widgets Magazine
srimukhi

లాస్య-శ్రీముఖి- రవిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరు ముగ్గురే ప్రస్తుతం యాంకరింగ్‌లో బుల్లితెరపై దుమ్ముదులిపేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న రవి ఇటీవలే లాస్య-శ్రీముఖిలతో లింకు పెట్టి వస్తున్న వార్తలను కొట్టిపారేశాడు. వారు మంచి ఫ్రెండ్స్ అంటూ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తాజాగా యాంకర్‌ రవి ఓ లైవ్‌ చాట్‌లో పాల్గొన్నాడు. అభిమానులు అడిగిన బుల్లెట్‌లాంటి ప్రశ్నలకు డైరెక్ట్‌గా సమాధానాలిచ్చేశాడు.
 
‘శ్రీముఖిని లవ్ చేస్తున్నారా?’ అని ఓ నెటిజన్ ప్రశ్నించగా..‘బుద్ధున్నోడు ఎవడైనా చేస్తాడా?’ అంటూ ఫక్కున నవ్వాడు. ఇక, ‘యాంకర్‌ శ్రీముఖితో నీకు అఫైర్‌ ఉందంటూ చాలామంది రాస్తున్నారని, అలాంటి వారందరినీ నరికేయమ’ని ఓ అభిమాని సలహా ఇచ్చాడు. ‘నీదీ, శ్రీముఖిదీ ఓవరాక్షన్‌ చూడలేకపోతున్నాంరా అయ్యా’ అంటూ ఓ వ్యక్తి కామెంట్‌ చేశాడు. దీనికి రవి ధీటుగా సమాధానం ఇచ్చాడు. ''నీ చేతిలో రిమోట్‌ ఉందిరా అయ్యా, దాన్ని ఛేంజ్ చెయ్‌రా అయ్యా'' అంటూ యాన్సర్ చేశాడు. 
 
అలాగే ఓ ప్రొగ్రామ్‌లో బూతులు ఎక్కువైపోతున్నాయని ఓ నెటిజన్‌ ఫిర్యాదు చేశాడు. దానికి ‘అన్ని ప్రోగ్రామ్‌లు ఒకేలా ఉండవు. అన్ని ఎలిమెంట్‌లూ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు రూపకర్తలు. ఆ ప్రోగ్రామ్‌ అంతా ఫన్‌ ఉండాలన్నదే మా కాన్సెప్ట్‌. అందులో కొంచెం బూతులు కూడా ఉన్నాయనే విషయం నాకు తెలుసు’ అని జవాబిచ్చాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

''కాటమరాయుడు'' టీజర్ చూసిన అన్నయ్య.. పవన్‌ను ఇంటికి పిలిపించి?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. మెగాస్టార్ చిరంజీవిల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని.. ...

news

"మెగా 150 గేమ్"ను విడుద‌ల చేసిన వి.వి.వినాయ‌క్‌ - దిల్‌రాజు

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబ‌ర్ 150' బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం ...

news

శ‌ర్వానంద్ చేతుల‌మీదుగా 'ఓ పిల్లా నీ వ‌ల్లా' టీజ‌ర్ లాంచ్‌

కిషోర్ స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో బిగ్ విగ్ మూవీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ‌ నిర్మిస్తున్న‌ ...

news

నాగచైతన్య - సాయి కొర్రపాటి-సురేష్ బాబుల కాంబినేషన్ చిత్రం ప్రారంభం!

నాగచైతన్య, లావణ్య త్రిపాఠి జంటగా ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి ...