శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Modified: బుధవారం, 30 నవంబరు 2016 (22:46 IST)

అనుష్క పెళ్లి ఖాయమేనట... బెంగళూరు వ్యాపారవేత్తతో... ఎవరో అతను?

నటి అనుష్క పెళ్లి చేసుకుంటుందని పలుసార్లు వార్తలు వచ్చాయి. అయితే ఈసారి కచ్చితంగా చేసుకుని తీరుతుందని కోలివుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అందుకు కారణం బెంగుళూర్‌కి చెందిన ఓ వ్యాపారవేత్త ఇంటికి ఆమె తల్లిదండ్రులు వెళ్ళివచ్చారట. దాంతో పుకార్లు షికార్లు చేస్త

నటి అనుష్క పెళ్లి చేసుకుంటుందని పలుసార్లు వార్తలు వచ్చాయి. అయితే ఈసారి కచ్చితంగా చేసుకుని తీరుతుందని కోలివుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అందుకు కారణం బెంగుళూర్‌కి చెందిన ఓ వ్యాపారవేత్త ఇంటికి ఆమె తల్లిదండ్రులు వెళ్ళివచ్చారట. దాంతో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 
 
అనుష్క కుటుంబ సభ్యులకు వ్యాపారవేత్త తండ్రి చాలా సన్నిహితుడనీ .. తల్లిదండ్రులు చూసిన ఈ సంబంధానికి అనుష్క గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసిందని అంటున్నారు. పెళ్లి విషయాన్ని దృష్టిలో పెట్టుకునే .. అనుష్క కొత్తగా ఏ సినిమాలను అంగీకరించడం లేదని అంటున్నారు.  ప్రస్తుతం నాగార్జునతో 'ఓం నమో వేంకటేశాయ' చిత్రంలో నటించింది. తర్వాత 'భాగమతి' చేస్తుంది. ఆ తర్వాత పెద్దగా సినిమాలు అంగీకరించడం లేదని సమాచారం.