Widgets Magazine

ప్రియుడితో షాపింగ్.. ఫ్రెండ్స్‌తో డిన్నర్... న్యూయార్క్ వీధుల్లో బాలీవుడ్ భామ చక్కర్లు

సోమవారం, 17 జులై 2017 (11:06 IST)

Widgets Magazine
anushka sharma - virat

బాలీవుడ్‌ భామల్లో అనుష్క శర్మ ఒకరు. ఈమె ప్రియుడితో షాపింగ్... స్నేహితులతో రాత్రి పార్టీల్లో మునిగితేలుతోంది. పైగా, ప్రతిష్టాత్మక ఐఫా అవార్డులకు డుమ్మా కొట్టింది. న్యూయార్క్ నగరంలో చక్కర్లు కొడున్న అనుష్క గురించిన కొన్ని విషయాలు వెలుగు చూశాయి. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
బాలీవుడ్ తార‌ల సంద‌డితో ఐఫా 2017 వేడుక అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. అంద‌రు తార‌ల‌తో పాటు అనుష్క శ‌ర్మ కూడా న్యూయార్క్ వెళ్ళింది. కానీ, ఐఫా కోస‌మే వెళ్లింది అనుకున్నారంతా! కానీ కాదు ఐఫా కంటే త‌న‌కు విరాటే ముఖ్యం అంటూ న్యూయార్క్ వీధుల్లో ప్రియుడు విరాట్‌తో క‌లిసి చ‌క్క‌ర్లు కొడుతుందీ భామ‌.
 
గ‌తేడాది 'సుల్తాన్', 'యే దిల్ హై ముషికిల్' సినిమాల‌కు ఐఫా అవార్డు గెల్చుకున్న అనుష్క ఈ ఏడాది ఐఫా ఉత్స‌వాలకు హాజ‌రు కాలేదు. అది కూడా న్యూయార్క్‌లోనే ఉండి వేడుక‌కు హాజ‌రుకాక‌పోవ‌డంతో అభిమానులు పెద‌వి విరుస్తున్నారు. కేవ‌లం అభిమానుల‌కే కాదు కింగ్ ఖాన్ షారుక్‌ను కూడా అనుష్క నిరాశ‌ప‌రిచింది. త‌మ కొత్త చిత్రం 'జ‌బ్ హ్యారీ మెట్ సెజ‌ల్' ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో షారుక్‌తో పాటు పాల్గొన‌టం లేదు. పాపం షారుక్ ఒక్క‌టే సినిమా ప్ర‌చారాల్లో నిమ‌గ్న‌మైపోయాడు.
 
మరోవైపు అనుష్క శర్మ మాత్రం ప్రియుడు విరాట్‌తో షాపింగ్‌, చిన్న‌నాటి స్నేహితుల‌తో డిన్న‌ర్‌, చిన్న‌చిన్న పార్టీల‌తో హాలీడేను ఎంజాయ్ చేస్తోంది. ఈ విష‌యాల‌న్నీ ఎప్ప‌టిక‌ప్పుడు అనుష్క‌, విరాట్‌లు త‌మ ఇన్‌స్టాగ్రాం పేజీల్లో అప్‌డేట్ చేస్తూనే ఉన్నారు. ఐఫా వేడుకలకు డుమ్మాకొట్టి... విరాట్‌తో వెకేషన్‌కు వెళ్లడాన్ని పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'నా పేరు సూర్య' అంటున్న బన్నీకి జోడీ కుదిరింది...

'దువ్వాడ జగన్నాథమ్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీజేగా ఆలరించిన అల్లు అర్జున్.. ...

news

యూ ట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్న 'జ‌య జాన‌కి నాయ‌క' (Teaser)

యూట్యూబ్‌లో గత ఐదు రోజులుగా ఓ సినిమా వీడియో హల్‌చల్ చేస్తోంది. ఈ ఒక్క వీడియోనే ...

news

రకుల్ కూడా అదే బాటలో.. పోలీస్ డ్రస్‌పై మక్కువ పెరిగిందట.. తమిళంలో ఛాన్స్

ఈ మధ్య కాలంలో బెల్లం శ్రీదేవి పాత్రలో రాశిఖన్నా ధరించిన యూనిఫాం ఒక్కసారిగా అందరినీ ...

news

'ఉయ్యాలవాడ'లో రెండో హీరోయిన్‌ పేరు ఖరారు... రెమ్యునరేషన్‌గా రూ.4 కోట్లు?

మెగాస్టార్ చిరంజీవి నటించే 151వ చిత్రం "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి". ఈ చిత్రాన్ని భారీ ...