Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'బాహుబలి-2' చిత్రానికి యు/ఏ సర్టిఫికేట్... సూపర్బ్ అన్న సెన్సార్ సభ్యులు!

మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (14:35 IST)

Widgets Magazine

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం 'బాహుబలి-2' ది కంక్లూజన్ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికేట్ మంజూరు చేసినట్టు సమాచారం. నిజానికి 'బాహుబలి' చిత్రం మొదటి భాగం విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం రెండో భాగం కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసున్నారు. ముఖ్యంగా 'బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపారన్న ప్రశ్నే ప్రతి ఒక్కరి మెదళ్లను తొలుస్తూ వస్తోంది. 
 
ఈ క్రమంలో గత యేడాదిన్నర కాలంగా ఎన్నో కష్టనష్టాలకోర్చి.. భారీ బడ్జెట్‌తో, భారీ విజువల్ గ్రాండియర్‌తో, తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రాండ్‌గా ఈ చిత్రం రెండో భాగాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం సోమవారం సెన్సార్ పూర్తైందని టాక్. దీనిపై అధికారిక సమాచారం ఏమీ లేకున్నా.. ఫిల్మ్‌నగర్ సర్కిల్స్ ప్రకారం ఏప్రిల్ 17న చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చినట్టు తెలుస్తోంది. 'బాహుబలి-2'కి సెన్సార్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు సమాచారం. సినిమా చాలా బాగుందని సెన్సార్ సభ్యులు అన్నట్టు తెలుస్తోంది. 
 
కాగా, తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆయా భాషల్లోనూ సెన్సార్ బోర్డు క్లియరెన్స్ కోసం 'బాహుబలి' చిత్రం వేచి చూస్తోందట. కాగా, ఈ చిత్రం ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Pabhas Telugu Rana Anushka Baahubali 2 Censored With U/a

Loading comments ...

తెలుగు సినిమా

news

వాళ్లను బికినీతో పడగొట్టాలని చూస్తున్న లక్ష్మీరాయ్... రెచ్చిపోయి చూపిస్తూ...

ఔను.. లక్ష్మీరాయ్ తొలిసారి బికినీలో సినిమా తెరపై కనిపించనుంది. ఇప్పటివరకు సుమారు 50 ...

news

కేక పుట్టిస్తున్న అల్లు అర్జున్- స్నేహా రెడ్డి ప్రైవేట్ స్టిల్స్ (బ్యూటిఫుల్ ఫోటోలు)

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డిల ప్రైవేట్ ఫోటోలు సోషల్ ...

news

రాధికా ఆప్టే ఫోటో షూట్ అదిరింది.. తెల్లని డ్రెస్‌లో బక్కబలచని అందాలు

సంచలన వ్యాఖ్యలతో అప్పుడప్పుడు వార్తల్లో కెక్కే క్రేజీ బ్యూటీ రాధిక ఆప్టే ఎల్లే కవర్ ...

news

ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితా.. అలియా భట్, దీపా కర్మాకర్, సాక్షిమాలిక్‌లకు చోటు

జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, ఒలింపిక్ పతక విజేత సాక్షీ మాలిక్, బాలీవుడ్ నటి అలియా భట్‌లకు ...

Widgets Magazine